ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడు-కేరళ మధ్య Bus సర్వీసులు ప్రారంభం

ABN, First Publish Date - 2021-12-02T17:45:23+05:30

కొవిడ్‌ లాక్‌డౌన్‌ సడలింపుల కారణంగా సుమారు ఒకటిన్నర సంవత్సరానికి పైగా కేరళ-తమిళనాడు రాష్ట్రాల మధ్య నిలిపివేసిన బస్సు సర్వీసులు బుధవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో విధించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై): కొవిడ్‌ లాక్‌డౌన్‌ సడలింపుల కారణంగా సుమారు ఒకటిన్నర సంవత్సరానికి పైగా కేరళ-తమిళనాడు రాష్ట్రాల మధ్య నిలిపివేసిన బస్సు సర్వీసులు బుధవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ గత 30వ తేదీతో ముగియడంతో స్వల్ప మార్పులతో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని, కేరళ-తమిళనాడు రాష్ట్రాల మధ్య డిసెంబరు 1 నుంచి బస్సు సర్వీసులు పునరుద్ధరించనున్నట్టు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు కోయంబత్తూర్‌ జిల్లా పొల్లాచ్చి బస్టాండ్‌ నుంచి కేరళ రాష్ట్రంలోని పాల్గాట్‌కు బుధవారం ఉదయం రెండు బస్సులు, దత్తంమంగళం ప్రాంతానికి ఒక బస్సు, పరంబికుళానికి ఒక బస్సు, గురువాయూర్‌కు రెండు బస్సులు, తిరుచ్చూర్‌కు ఒక బస్సు... మొత్తం ఏడు బస్సులు బయల్దేరి వెళ్లాయి. అదే విధంగా, కేరళ రాష్ట్రం నుంచి పదికి పైగా ప్రభుత్వ రవాణా బస్సులు సహా ఓ ప్రైవేటు బస్సు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు నడిపారు. 21 నెలల అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సేవలు పునఃప్రారంభం కావడంపై రెండు రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు.


Updated Date - 2021-12-02T17:45:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising