నా కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు
ABN, First Publish Date - 2021-11-08T14:02:30+05:30
తన వల్ల ప్రజలకు ఇబ్బంది కలగడం తనకేమాత్రం ఇష్టం లేదని, అందువల్ల తన కాన్వాయ్ వెళ్లేటప్పుడు ప్రజలపై ఎలాంటి ఆంక్షలు విధించరాదని రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి రాష్ట్ర డీజీపీ శైలేంద్రబాబుకు సూచించారు. డీ
- ట్రాఫిక్‌ను నిలపొద్దు
- డీజీపీకి గవర్నర్ సూచన
చెన్నై: తన వల్ల ప్రజలకు ఇబ్బంది కలగడం తనకేమాత్రం ఇష్టం లేదని, అందువల్ల తన కాన్వాయ్ వెళ్లేటప్పుడు ప్రజలపై ఎలాంటి ఆంక్షలు విధించరాదని రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి రాష్ట్ర డీజీపీ శైలేంద్రబాబుకు సూచించారు. డీజీపీ శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తన కాన్వాయ్ వెళ్లేటప్పుడు ట్రాఫిక్‌ని నిలిపేయరాదని సూచించారు. అంతేగాక తన పర్యటనల సందర్భంగా ప్రజలపై ఎలాంటి ఆంక్షలు విధించరాదని కూడా స్పష్టం చేశారు. ఇటీవల హైకోర్టు న్యాయమూర్తి ప్రయాణానికి ఇబ్బంది కలగడంతో ఆయన రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శిపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సీఎం పాల్గొన్న ఓ కార్యక్రమం వల్ల న్యాయమూర్తికి ఇబ్బంది కలిగింది. దీని పట్ల కలత చెందిన సీఎం స్టాలిన్ కూడా తన కాన్వాయ్‌లోని కార్ల సంఖ్యను తగ్గించుకున్నారు.
Updated Date - 2021-11-08T14:02:30+05:30 IST