ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీట్ నిర్వహణపై మళ్లీ ఆలోచించండి: ప్రధానిని కోరిన సీఎం స్టాలిన్

ABN, First Publish Date - 2021-07-17T07:29:27+05:30

ట్ పరీక్ష నిర్వహించాలనే ఆలోచనపై మరోసారి కేంద్రం ఆలోచించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ‘స్కూళ్లు, కాలేజీలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: నీట్ పరీక్ష నిర్వహించాలనే ఆలోచనపై మరోసారి కేంద్రం ఆలోచించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ‘స్కూళ్లు, కాలేజీలు మూసి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షను నిర్వహిస్తే కరోనా వ్యాప్తికి కారణంగా మారే అవకాశం ఉంది. అందువల్ల మీ నిర్ణయంపై మరోసారి ఆలోచించండి’ అని స్టాలిన్ ప్రధానిని కోరారు. కాగా.. కోన్ని రిపోర్టుల ప్రకారం.. స్టాలిన్ త్వరలో రాష్ట్రపతిని కలిసి అనేక సమస్యలపై చర్చించనున్నారు. అందులో నీట్ పరీక్ష నిర్వహణపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. 


ఇదిలా ఉంటే నీట్ యూజీ 2021 పరీక్షను సెప్టెంబర్ 12న నిర్వహించబోతున్నట్టు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా నిబంధనలు పాటిస్తూ ఇందుకోసం ఏర్పాట్లు చేస్తామని కేంద్రం తెలిపింది. అలాగే నీట్ పీజీ 2021 పరీక్షకు సంబంధించిన తేదీని కూడా కేంద్రం ఖరారు చేసింది. సెప్టెంబర్ 11 అంటే నీట్ యూజీ పరీక్షకు ఒక రోజు ముందే నీట్ పీజీ పరీక్ష నిర్వహిస్తామని కేంద్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు.

Updated Date - 2021-07-17T07:29:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising