ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

tirupati తరహాలో భక్తులకు టైమ్‌ స్లాట్‌

ABN, First Publish Date - 2021-10-20T14:03:15+05:30

తిరుచ్చెందూరు ఆలయ దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో టైమ్‌ స్లాట్‌ను కేటా యిస్తామని రాష్ట్ర హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి పీకే శేఖర్‌బాబు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రూ.300 కోట్లతో తిరుచ్చెందూరు ఆలయ అభివృద్ధి 

- మంత్రి శేఖర్‌ బాబు వెల్లడి


అడయార్‌(chennai): తిరుచ్చెందూరు ఆలయ దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో టైమ్‌ స్లాట్‌ను కేటా యిస్తామని రాష్ట్ర హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి పీకే శేఖర్‌బాబు తెలిపారు. అలాగే, తిరుచ్చెందూరు ఆలయాన్ని రూ.300 కోట్ల వ్యయంతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు వెల్లడించారు. స్థానిక నుంగం బాక్కంలోని హిందూదేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో తిరుచ్చెందూరు ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శేఖర్‌బాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆదే శాల మేరకు ప్రకటించిన ప్రతి ఒక్క అంశాన్ని అమలుపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆలయాల ఆస్తులను భక్తుల వినియోగానికి అందుబాటులోకి తీసుకుని వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. తిరుచ్చెందూరు మురుగన్‌ ఆలయానికి భక్తుల తాకిడి క్రమంగా పెరుగుతోందని, అందుకే ఈ ఆలయంలో 300 కోట్ల వ్యయంతో వివిధ రకాల అభివృద్ధి పనులను చేపట్టనున్నట్టు వెల్లడించారు. ముఖ్యంగా ఈ ఆలయంలో అంగాభిషేకం చేసే భక్తులు అధిక సమయం వేచి వుండకుండా, స్వామి దర్శనంలో తీవ్ర జాప్యం చోటుచేసుకోకుండా ఉండేందుకు వీలుగా తిరుమల తరహాలో టైమ్‌ స్లాట్‌ను కేటాయించే విషయాన్ని ఆలోచిస్తున్నట్టు వెల్లడించారు. 

Updated Date - 2021-10-20T14:03:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising