ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘తమిళ్ తాయ్ వాళ్‌తు’ ఇక రాష్ట్ర గీతం... వినిపించినపుడు నిల్చోవడం తప్పనిసరి...

ABN, First Publish Date - 2021-12-17T20:18:35+05:30

తమిళ తల్లిని కీర్తిస్తూ రాసిన ‘తమిళ్ థాయ్ వాళ్‌తు’ను రాష్ట్ర గీతంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : తమిళ తల్లిని కీర్తిస్తూ రాసిన ‘తమిళ్ తాయ్ వాళ్‌తు’ను రాష్ట్ర గీతంగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ గీతాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో జరిగే అన్ని సార్వజనిక కార్యక్రమాల్లోనూ ఆలపించాలని, ఆలపించే సమయంలో అందరూ నిల్చొని, గౌరవాన్ని ప్రదర్శించాలని తెలిపింది. అయితే శారీరక లోపాలుగలవారు నిలబడవలసిన అవసరం లేదని తెలిపింది. 


మద్రాస్ హైకోర్టు ఇటీవల ఓ కేసులో తీర్పు చెప్తూ, ఇది కేవలం ప్రార్థన పాట అని తెలిపింది. సార్వజనిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు ఈ పాట పాడేటపుడు నిల్చోవాలని తెలిపే కార్యనిర్వాహక ఆదేశాలేవీ లేవని తెలిపింది. 


మరోవైపు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ ఈ ఏడాది స్నాతకోత్సవాల సందర్భంగా ఈ పాటను పాడించలేదు. దీంతో తమిళనాడు ఉన్నత విద్యా శాఖ మంత్రి ఐఐటీకి ఓ లేఖ రాశారు. 


జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలని భారత రాజ్యాంగంలోని అధికరణ 51ఏ(ఏ) చెప్తోంది. 

Updated Date - 2021-12-17T20:18:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising