ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడులో నేడూ భారీవర్షాలు...orange alert జారీ

ABN, First Publish Date - 2021-11-09T13:26:46+05:30

తమిళనాడు రాష్ట్రంలో తుపాన్ వల్ల మంగళవారం కూడా భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో తుపాన్ వల్ల మంగళవారం కూడా భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. భారీవర్షాల కురవనున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. చెన్నై సబ్‌వేలలో వరద నీటిని తొలగించడానికి గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ 23,000 మంది సిబ్బందిని నియమించింది.వచ్చే ఐదు రోజుల్లో కేరళ, దక్షిణ కోస్తా ఆంధ్ర‌ప్రదేశ్, తమిళనాడులో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.చెన్నై, దాని శివారు ప్రాంతాల్లో వరదనీటి ప్రవాహంతో సోమవారం  సబ్‌వేలను మూసివేశారు.నీలగిరి, కోయంబత్తూర్, దిండిగల్, తేని, తెన్కాసి, తిరునల్వేలితో సహా 14 జిల్లాలకు ఐఎండీ ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది.


ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీద వాయుగుండం ఏర్పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.చెన్నైలో భారీ వర్షాల కారణంగా పలు మార్గాల్లో బస్సు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.భారీ వర్షాల కారణంగా పలు మార్గాల్లో బస్సు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం నాటికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో 20కి పైగా బృందాలను మోహరించామని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు.


Updated Date - 2021-11-09T13:26:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising