ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళ సీనియర్‌ నటుడు శ్రీకాంత్‌ కన్నుమూత

ABN, First Publish Date - 2021-10-13T14:18:22+05:30

ప్రముఖ సీనియర్‌ తమిళ నటుడు శ్రీకాంత్‌ మంగళవారం సాయంత్రం మృతి చెందారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. 1965లో శ్రీధర్‌ దర్శకత్వంలో ‘వెన్నిరాడై’ చిత్రం ద్వారా శ్రీకాంత్‌ తమిళ చిత్రసీమకు పరిచయయ్యారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: ప్రముఖ సీనియర్‌ తమిళ నటుడు శ్రీకాంత్‌ మంగళవారం సాయంత్రం మృతి చెందారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. 1965లో శ్రీధర్‌ దర్శకత్వంలో ‘వెన్నిరాడై’ చిత్రం ద్వారా శ్రీకాంత్‌ తమిళ చిత్రసీమకు పరిచయయ్యారు. ఆ తర్వాత శివాజీ గణేశన్‌, జయశంకర్‌, ముత్తురామన్‌, రజనీకాంత్‌ వంటి మేటి హీరోలు నటించిన చిత్రాల్లో నటించారు. సుమారు రెండువందలకు పైగా తమిళ చిత్రాల్లో ఆయన నటించారు. ‘రాజనాగం’ (తెలుగులో ‘కోడెనాగు’) చిత్రంలో శ్రీకాంత్‌ హీరోగా నటించి యువతను బాగా ఆకట్టుకున్నారు. శివాజీ గణేశన్‌ నటించిన ‘తంగపదక్కం’ చిత్రంలో ఆయన తనయుడిగా నటించి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భీమ్‌సింగ్‌ దర్శకత్వంలో ‘సిలనేరంగలిల్‌ సిలమనిదరగళ్‌’ చిత్రంలో ఆయన ప్రముఖ నటి లక్ష్మితో ధీటుగా నటించి ప్రేక్షకుల ప్రశంసలందుకున్నారు. ఇక తమిళ సూపర్‌స్టార్‌ హీరోగా పరిచయమైన శ్రీకాంత్‌ ‘భైరవి’ చిత్రంలో విలన్‌గా నటించారు.

Updated Date - 2021-10-13T14:18:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising