ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుజరాత్ ఉప ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2021-08-29T00:03:54+05:30

దేశంలో హిందువుల మెజారిటీ ఉన్నంత వరకే భారత రాజ్యాంగం, చట్టాలు, లౌకకవాదం వంటి మాటలు వినపడుతుంటాయని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాంధీనగర్: దేశంలో హిందువుల మెజారిటీ ఉన్నంత వరకే భారత రాజ్యాంగం, చట్టాలు, లౌకకవాదం వంటి మాటలు వినపడుతుంటాయని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ అన్నారు. హిందువులు మైనారిటీల స్థాయికి పడిపోనంత వరకూ కోర్టులు, లోక్‌సభ, రాజ్యాంగం, సెక్యులరిజం యథాతథంగా ఉంటాయని పేర్కొన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.


''దేశంలో హిందువుల మెజారిటీ ఉన్నంత వరకే సెక్యులరిజం, రాజ్యాంగం, చట్టాల గురించి మాట్లాడతారు. మరో 1000, 2000 సంవత్సరాల తర్వాత హిందువులు తగ్గిపోతే, వేరే మతానికి చెందిన వారి సంఖ్య పెరిగితే ఇక కోర్టులు, లోక్‌సభ, రాజ్యాంగం, సెక్యులరిజం అనే మాటలకు కాలం చెల్లినట్టే. అవేవీ ఇక కనబడవు''అని నితిన్ పటేల్ వ్యాఖ్యానించారు. తాను ప్రత్యేకించి ముస్లింల గురించో, క్రిస్టియన్ల గురించో చెప్పడం లేదని, వారిలో చాలామంది దేశభక్తులు ఉన్నారని అన్నారు. దేశభక్తుల్లో వేలాది ముస్లింలు, క్రిస్టియన్ల ఉన్నారనీ, వేలాది మంది ముస్లింలు ఇండియన్ ఆర్మీలో, వందలాది గుజరాత్ పోలీసు బలగాల్లో పని చేస్తున్నారని చెప్పారు. తక్కిన వాళ్ల గురించే నేను మాట్లాడుతున్నానని అన్నారు. కాగా, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. దేశాన్ని విడగొట్టాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నాయని విమర్శించింది.

Updated Date - 2021-08-29T00:03:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising