ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆఫ్ఘన్‌లో విదేశీ కరెన్సీపై నిషేధం

ABN, First Publish Date - 2021-11-03T15:52:27+05:30

ఆఫ్ఘనిస్థాన్‌లో విదేశీ కరెన్సీని ఉపయోగించడంపై తాలిబన్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌లో విదేశీ కరెన్సీని ఉపయోగించడంపై తాలిబన్లు నిషేధం విధించారు. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ మరిన్ని ఇబ్బందుల్లో చిక్కుకునే అవకాశం ఉంది. తాలిబన్లు ఆఫ్ఘన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ దేశ కరెన్సీ ఆఫ్ఘని విలువ క్షీణించింది. ఆ దేశ నిధులను విదేశాల్లో స్తంభింపజేశారు.


ఆఫ్ఘనిస్థాన్ బ్యాంకుల్లో నగదు కొరత తీవ్రంగా ఉంది. మరోవైపు ఆ దేశంలో తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావడం లేదు. ఆ దేశంలో అనేక లావాదేవీలు అమెరికన్ డాలర్లలో జరుగుతాయి. దక్షిణ సరిహద్దుల్లోని వాణిజ్య మార్గానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో పాకిస్థానీ రూపాయలను ఉపయోగిస్తున్నారు. 


తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఇకపై దేశీయ వ్యాపార, తదితర కార్యకలాపాల కోసం విదేశీ కరెన్సీని ఉపయోగిస్తే, కేసులు నమోదు చేసి, విచారణ జరుపుతామని చెప్పారు. ఆర్థిక పరిస్థితి, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆఫ్ఘన్లంతా ఆఫ్ఘని కరెన్సీని మాత్రమే ప్రతి లావాదేవీలోనూ ఉపయోగించవలసిన అవసరం ఉందని చెప్పారు. ప్రజలంతా విదేశీ కరెన్సీ లావాదేవీలను మానుకోవాలని తెలిపారు. 


Updated Date - 2021-11-03T15:52:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising