ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌కు తాలిబన్ల లేఖ

ABN, First Publish Date - 2021-09-29T19:59:51+05:30

ఆఫ్ఘనిస్థాన్‌-భారత్ మధ్య వైమానిక సేవలను పునరుద్ధరించాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్‌-భారత్ మధ్య వైమానిక సేవలను పునరుద్ధరించాలని తాలిబన్ ప్రభుత్వం కోరింది. కాబూల్‌కు వాణిజ్య విమానాలను పునరుద్ధరించాలని కోరుతూ డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్)కు ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ ఓ లేఖ రాసింది. ఈ లేఖను భారత దేశ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సమీక్షిస్తోంది. 


ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైన తర్వాత కాబూల్‌కు వైమానిక సేవలను భారత దేశం నిలిపేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ప్రయాణికుల సంచారం సజావుగా జరగాలనే ఉద్దేశంతో ఈ లేఖను రాస్తున్నట్లు ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్‌-భారత్ మధ్య వైమానిక సేవలను పునరుద్ధరించాలని కోరింది. అదేవిధంగా ఆఫ్ఘనిస్థాన్ నేషనల్ క్యారియర్స్ (అరియానా ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్స్, కామ్ ఎయిర్) తమ షెడ్యూల్డు ఫ్లైట్స్‌ను పునరుద్ధరించాలనుకుంటున్నట్లు తెలిపింది. తమ కమర్షియల్ ఫ్లైట్స్‌ పునరుద్ధరణకు అవకాశం కల్పించాలని ఆఫ్ఘనిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ కోరుతోందని పేర్కొంది. 


భారత దేశం కాబూల్‌కు చిట్ట చివరిగా ఆగస్టు 21న విమానాన్ని నడిపింది. భారత వాయు సేన విమానంలో భారత పౌరులను కాబూల్ నుంచి తీసుకొచ్చింది. 


Updated Date - 2021-09-29T19:59:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising