ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాబూల్ గురుద్వారలో తాలిబన్ల విధ్వంసం

ABN, First Publish Date - 2021-10-06T17:24:13+05:30

తాలిబన్ ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. కాబూల్‌లోని గురుద్వారా కర్తె పర్వాన్‌లోకి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్: తాలిబన్ ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. కాబూల్‌లోని గురుద్వారా కర్తె పర్వాన్‌లోకి మంగళవారంనాడు ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. గురుద్వారాలోని పలువురుని నిర్బంధంలోకి తీసుకున్నారు. సిక్కుల పవిత్రమైన గురుద్వారాను తాలిబన్లు ధ్వంసం చేయడాన్ని ఇండియన్ వరల్డ్ ఫోరం ఖండించింది. కాబూల్ నుంచి తమకు అందిన సమాచారం ప్రకారం గుర్తుతెలియని సాయుధ తాలిబన్లు గురుద్వారాలోకి ప్రవేశించి, అక్కడి వారందరినీ నిర్బంధంలోనికి తీసుకున్నారని, గురుద్వారాలోని సీసీటీవీ  కెమెరాలతో పాటు గురుద్వారాను ధ్వంసం చేశారని ఫోరం అధ్యక్షుడు పునీత్ సింగ్ ఛాందోగ్ తెలిపారు. విషయం తెలిసిన వెంటనే స్థానికి గురుద్వారా మేనిజిమెంట్ అక్కడకు చేరుకుంది. అప్ఘనిస్తాన్‌లోని వాయవ్య కాబూల్‌లో కర్తె పర్వాన్ గురుద్వారా ఉంది.


గతంలో, తూర్పు పాక్టియా ప్రావిన్స్‌లోని తాలిబన్లు ప్రవేశించి సిక్కుల పవిత్ర జెండా నిషాన్ సాహిబ్‌ను తొలగించారు. ఈ గురుద్వారాను ఒక పర్యాయం సిక్కుల మతగురువు గురునానక్ సందర్శించారు. అప్ఘనిస్థాన్‌ను ఇటీవల తాలిబన్ల వశం అయిన్నప్పటి నుంచి దేశంలోని మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని హత్యాకాండ, హింస, మతపరమైన వివక్ష వంటి దురాగతాలకు పాల్పడుతున్నారు.

Updated Date - 2021-10-06T17:24:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising