ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Afghanistan: పంజ్‌షీర్‌లో ఇంటర్నెట్‌ను నిలిపేసిన తాలిబన్లు

ABN, First Publish Date - 2021-08-29T21:20:55+05:30

ఆఫ్ఘనిస్థాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమృల్లా సాలే ట్విట్టర్ బాహ్య ప్రపంచానికి పంపిస్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమృల్లా సాలే ట్విట్టర్ ద్వారా బాహ్య ప్రపంచానికి పంపిస్తున్న సమాచారానికి అడ్డుకట్ట వేసేందుకు తాలిబన్లు నడుంబిగించారు. తమకు కొరకరాని కొయ్యగా మారిన పంజ్‌షీర్ వ్యాలీలో ఇంటర్నెట్‌ను మూసివేశారు. ఆఫ్ఘనిస్థాన్ మొత్తం తాలిబన్ల వశమైనప్పటికీ పంజ్‌షీర్ ప్రావిన్స్ మాత్రం ఇంకా వారికి అందని ద్రాక్షగానే మారింది. తాలిబన్ వ్యతిరేకులు పంజ్‌షీర్‌లో ఒక్కటై వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు.


లెజండరీ ఆఫ్ఘన్ రెబల్ కమాండర్ అహ్మద్ షా మసౌద్ కుమారుడైన అహ్మద్ మసౌద్ తాలిబన్లకు కంటిలో నలుసుగా మారారు. అహ్మద్, అమృల్లా ఇద్దరూ ఇప్పుడు ఇక్కడే ఉన్నారు.  ఆఫ్ఘనిస్థాన్ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఈ నెల 15న దేశం నుంచి పారిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్థాన్ రాజ్యాంగం ప్రకారం అమృల్లా తనను తాను ఆఫ్ఘన్ ‘కేర్‌టేకర్‌ అధ్యక్షుడి’గా ప్రకటించుకున్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఏ దేశం కానీ, ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు కానీ అమృల్లాను  గుర్తించలేదు.  

Updated Date - 2021-08-29T21:20:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising