ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాకిస్థాన్ మా రెండో ఇల్లు : తాలిబన్లు

ABN, First Publish Date - 2021-08-26T19:24:15+05:30

పాకిస్థాన్ తమకు రెండో ఇల్లువంటిదని తాలిబన్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్ : పాకిస్థాన్ తమకు రెండో ఇల్లువంటిదని తాలిబన్లు చెప్తున్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటామంటున్నారు. భారత దేశంతో మంచి సంబంధాలను కోరుకుంటున్నామని చెప్తున్నారు. ఆఫ్ఘన్, పాకిస్థాన్ సంబంధాలు మరింత బలపడాలని కోరుకుంటున్నామన్నారు. తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ పాకిస్థాన్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు తెలిపారు. 


ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దులు కలిసి ఉన్న దేశాలని, మతపరంగా కూడా తాము ఒకే గూటి పక్షులమని చెప్పారు. ఇరు దేశాల ప్రజలు పరస్పరం కలిసిపోతారన్నారు. పాకిస్థాన్‌తో సంబంధాలు మరింత బలపడాలని కోరుకుంటున్నామన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ను తాము స్వాధీనం చేసుకోవడంలో పాకిస్థాన్ పాత్ర ఏమీ లేదన్నారు. తమ వ్యవహారాల్లో పాకిస్థాన్ ఎన్నడూ జోక్యం చేసుకోలేదన్నారు. 


భారత్-పాక్ పరిస్థితులపై...

భారత దేశం, పాకిస్థాన్ తమ మధ్య ఉన్న ప్రస్తుత సమస్యలను పరిష్కరించుకోవడానికి కలిసి కూర్చుని, చర్చించుకోవాలని ముజాహిద్ అన్నారు. భారత దేశంతో సహా అన్ని దేశాలతోనూ తాలిబన్లు మంచి సంబంధాలను కోరుకుంటున్నారని చెప్పారు. 


ఆఫ్ఘన్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై...

ఇస్లాంపై ఆధారపడిన బలమైన ప్రభుత్వాన్ని తాము కోరుకుంటున్నామని ముజాహిద్ చెప్పారు. ఆఫ్ఘన్లంతా ఇస్లాంలో భాగమేనని చెప్పారు. అమెరికా దళాలు ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఈ నెల 31న వెళ్ళిపోయే లోగానే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. తమ దళాలను ఉపసంహరించుకునే ప్రణాళికను అమెరికా ఆలస్యం చేయకూడదని చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాలు తమ నియంత్రణలోకి వచ్చాయన్నారు. 


Updated Date - 2021-08-26T19:24:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising