ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Aid workersగా మహిళలను అడ్డుకుంటున్న తాలిబన్లు

ABN, First Publish Date - 2021-11-06T17:43:01+05:30

సమాజంలో మహిళల హక్కులను కాలరాసే చర్యలకు ఇప్పుడప్పుడే తాలిబాన్ ఫుల్‌స్టాప్ పెట్టేలా కనిపించడం లేదు. తాజాగా తాలిబన్లు జారీ చేసిన ఆదేశాలే దీనికి నిదర్శనం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్ : సమాజంలో మహిళల హక్కులను కాలరాసే చర్యలకు ఇప్పుడప్పుడే తాలిబాన్ ఫుల్‌స్టాప్ పెట్టేలా కనిపించడం లేదు. తాజాగా తాలిబన్లు జారీ చేసిన ఆదేశాలే దీనికి నిదర్శనం. హ్యూమన్ రైట్స్ వాచ్ (HRW) ప్రకారం... ఆఫ్ఘన్ మహిళలు ఇక మీదట ఎయిడ్ వర్కర్లుగా పని చేయడంపై తాలిబన్లు నిషేధం విధించారు. ఇది నిజానికి ఆప్ఘన్‌ల ప్రాణ రక్షణకు సంబంధించిన విషయం. ఆఫ్ఘన్ మహిళలపై ఈ నిషేధం విధించడం ద్వారా అత్యవసర సమయంలో ఆఫ్ఘన్‌లకు ఎలాంటి సాయమూ అందకుండా పోతుందని స్థానిక మీడియా వెల్లడించింది.  


"మహిళా సహాయ కార్మికులపై తాలిబన్ విధిస్తున్న దారుణమైన ఆంక్షలు ఆఫ్ఘన్‌లకు మరీ ముఖ్యంగా చెప్పాలంటే మహిళలు, బాలికలు, మహిళలు-నేతృత్వం వహించే కుటుంబాలకు అవసరమైన ప్రాణ రక్షణ సాయం అందకుండా నిరోధిస్తున్నాయి’’ అని హ్యూమన్ రైట్స్ వాచ్‌లోని అసోసియేట్ మహిళా హక్కుల డైరెక్టర్ హీథర్ బార్ చెప్పినట్లు TOLO న్యూస్ వెల్లడించింది. 


34 ప్రావిన్స్‌లలో కేవలం మూడు మాత్రమే అధికారికంగా మహిళా కార్మికులను పనిచేయడానికి అనుమతించాయని HRWని ఉటంకిస్తూ వార్తా ఛానెల్ వెల్లడించింది. అక్టోబర్ 28, 2021 నాటికి, కేవలం మూడు ప్రావిన్సులలోని తాలిబాన్ అధికారులు మాత్రమే మహిళా సహాయక కార్మికులను తమ ఉద్యోగాలు చేయడానికి బేషరతుగా అనుమతిస్తూ రాతపూర్వక ఒప్పందాన్ని అందించారని తెలిపింది. 

Updated Date - 2021-11-06T17:43:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising