ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Afghanistan: మాజీ అధికారుల బ్యాంకు ఖాతాల ఫ్రీజ్

ABN, First Publish Date - 2021-09-09T16:39:07+05:30

అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ అధికారులు, చట్టసభ సభ్యుల ఖాతాలను స్తంభింప చేయాలని తాలిబన్లు బ్యాంకులను ఆదేశించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్యాంకులకు తాలిబన్ల ఆదేశం

కాబూల్ : అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ అధికారులు, చట్టసభ సభ్యుల ఖాతాలను స్తంభింప చేయాలని తాలిబన్లు బ్యాంకులను ఆదేశించారు.యూఎస్ మద్ధతుతో గత పాలనలో పనిచేసిన అఫ్ఘాన్ల అన్ని ఖాతాలను స్తంభింపచేయాలని తాలిబన్లు ప్రైవేటు బ్యాంకులకు లేఖలు రాశారు.అఫ్ఘాన్ మాజీ మంత్రులు, డిప్యూటీలు, ఎంపీలు, మేయర్ల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని బ్యాంకులను ఆదేశించారు.మంత్రులు, సహాయకులు, ఎంపీలు, మేయర్లు సహా మాజీ అఫ్ఘాన్ అధికారుల బ్యాంక్ ఖాతాల జాబితాను సెంట్రల్ బ్యాంక్‌కు పంపాలని తాలిబన్లు కోరారు.


గత వారం, తాలిబన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న వెంటనే మూసివేసిన బ్యాంకులను తిరిగి తెరవాలని ఆదేశించారు. నగదు ఉపసంహరణపై కఠినమైన వారపు పరిమితులు విధించారు. దీంతో చాలా మంది ప్రజలు నగదు పొందడానికి ఏటీఎంల వద్ద బారులు తీరారు.ఆస్తులు చాలా వరకు అఫ్ఘానిస్థాన్ లో భౌతికంగా లేవని ఆఫ్ఘనిస్తాన్ బ్యాంక్ గవర్నర్ అజ్మల్ అహ్మదీ చెప్పారు.దీంతో అఫ్ఘాన్ మొత్తం ద్రవ్య ఆస్తులలో కొద్ది మొత్తం మాత్రమే తాలిబన్లకు అందుబాటులో ఉండవచ్చు. 


Updated Date - 2021-09-09T16:39:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising