ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళా విద్యపై తాలిబన్ల సంచలన నిర్ణయం

ABN, First Publish Date - 2021-09-13T02:44:22+05:30

ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళా విద్యపై తాలిబన్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూనివర్సిటీలో మహిళలు చదువుకునేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళా విద్యపై తాలిబన్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూనివర్సిటీలో మహిళలు చదువుకునేందుకు అనుమతినిస్తూ ప్రపంచాన్ని నివ్వెర పరిచారు. నిజానికి తాలిబన్ల గత పాలనను దృష్టిలో ఉంచుకుని మహిళలపై కఠిన ఆంక్షలు విధిస్తారని, ఇక వారు ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుందని అందరూ భావించారు. అయితే, అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ మహిళా విద్యకు అనుమతి ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 


యూనివర్సిటీల్లో మహిళలు చదువుకునేందుకు అనుమతించిన తాలిబన్లు కొన్ని షరతులు మాత్రం విధించారు. స్త్రీ, పురుషులకు వేర్వేరు తరగతులు ఉంటాయని మాత్రం స్పష్టం చేశారు. మహిళలు తప్పనిసరిగా ఇస్లామిక్ సంప్రదాయ దుస్తులే ధరించాలన్న నిబంధన కూడా విధించారు.


బోధనాంశాల్లోనూ మార్పులు చేస్తామని తాలిబన్ మధ్యంతర ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా నియమితుడైన అబ్దుల్ హక్కానీ తెలిపారు. తాలిబన్ల తాజా ప్రకటనపై సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాబూల్ యూనివర్సిటీ నిర్వహించిన ఓ సదస్సులో ఈ ప్రకటనను స్వాగతిస్తూ తాలిబన్ జెండాలను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

Updated Date - 2021-09-13T02:44:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising