ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ తాలిబన్ టాప్ లీడర్‌కు భారత సైన్యం శిక్షణనిచ్చిందా..?

ABN, First Publish Date - 2021-08-21T14:25:23+05:30

భారత ఆర్మీలో ఒకప్పుడు విదేశీ జవాన్‌గా ఉన్నాడు. మంచి ధైర్యవంతుడు. పోరాటపటిమ గల సైనికుడు. దీనికి ప్రతీకగా అతడిని తోటి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత ఆర్మీలో ఒకప్పుడు విదేశీ జవాన్‌గా ఉన్నాడు. మంచి ధైర్యవంతుడు. పోరాటపటిమ గల సైనికుడు. దీనికి ప్రతీకగా అతడిని తోటి జవాన్లంతా షేరూ అని పిలుచుకునేవారు. కానీ కాలం మారింది. భారత సైన్యంతో కలిసి ఇండియన్ మిలటరీ అకాడెమీలో శిక్షణ పొందిన అతడు.. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ను అక్రమించుకుని కల్లోలం సృష్టిస్తున్న తాలిబన్ టాప్ 7 లీడర్లలో ఒకడు. తాలిబన్ రాజకీయ అధికారవర్గానికి ప్రధానాధికారి అయ్యాడు. అతడి పేరు షేర్ మహమ్మద్ అబ్బాస్ స్తానిక్‌‌జై.


భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత విదేశీ యువతకు కూడా మన సైనిక అకాడెమీ(ఐఎంఏ) శిక్షణనిచ్చేది. 1971 ఇండియా-పాకిస్తాన్ యుద్ధం తర్వాత నుంచి ఆఫ్ఘనిస్తాన్‌ యువతకు కూడా ఐఎంఏ శిక్షణనిచ్చింది. అలా 1982లో షేర్ మహమ్మద్‌ అబ్బాస్ స్తానిక్‌జై కూడా శిక్షణ తీసుకున్నాడు. అప్పుడు అతడి వయసు 20ఏళ్లు. ఐఎంఏ నుంచి పరమ్ విశిష్ట్ సేవా పురస్కారం, అతి విశిష్ట్ సేవా పురస్కారం, సేన పురస్కారం వంటి ఎన్నో అవార్డులు అందుకున్నాడు.


ఈ క్రమంలోనే షేర్ మహమ్మద్ గురించి అప్పటి అతడి తోటి సైనికులు అనేక విషయాలను పంచుకున్నారు. షేర్ మహమ్మద్ పక్కింటి కుర్రాడిలా ఉండేవాడని, అందరికంటే పెద్దవాడిలా మీసాలు మెలిపెట్టి ఉండేవాడని కొందరు చెప్పారు. అప్పటి స్తానిక్‌జై బ్యాచ్‌మేట్ కల్నల్ కేసర్ సింగ్ షెకావత్, రిటైర్డ్ మేజర్ జనరల్ డీఏ చతుర్వేది మాట్లాడుతూ.. స్తానిక్‌జై పక్కిటి పిల్లాడిలా ఉండేవాడని, చాలా స్నేహంగా మసలుకునేవాడని చెప్పుకొచ్చారు. 


కాగా.. ఏడాదిన్నర ఐఎంఏ శిక్షణ తరువాత షేర్ మహమ్మద్ ఆఫ్ఘన్ మిలటరీలో బాధ్యతలు స్వీకరించాడు. కానీ 1996లో ఆఫ్ఘన్ ఆర్మీని వీడి తాలిబన్లలో చేరాడు. తాలిబన్ల గుర్తింపు కోసం అప్పటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్‌తో కూడా మంతనాలు జరిపాడు. అయితే ఇప్పుడు 60 ఏళ్ల వయసు వచ్చేసరికి తాలిబన్ల రాజకీయ ప్రధాన అధికారిగా మారాడు. మరో విశేషం ఏమంటే స్తానిక్‌జై ఇంగ్లీష్ చదువు కూడా భారత్‌లోనే కొనసాగింది. 

Updated Date - 2021-08-21T14:25:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising