ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

aspirin టాబ్లెట్ తీసుకుంటే హృద్రోగ ముప్పు పెరుగుతోంది...ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయం తాజా అధ్యయనంలో వెల్లడి

ABN, First Publish Date - 2021-11-24T18:19:39+05:30

ఆస్పిరిన్ టాబ్లెట్ తీసుకోవడం వల్ల హృద్రోగ ముప్పు 26 శాతం పెరుగుతుందని ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయం తాజా అధ్యయనంలో వెల్లడైంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రస్సెల్స్ (బెల్జియం): ఆస్పిరిన్ టాబ్లెట్ తీసుకోవడం వల్ల హృద్రోగ ముప్పు 26 శాతం పెరుగుతుందని ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయం తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీంతో పాటు ధూమపానం, ఊబకాయం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం వల్ల హృద్రోగ సమస్యలు ఏర్పడతాయని పరిశోధకులు చెప్పారు. ఫ్రీబర్గ్ యూనివర్శిటీ చేసిన పరిశోధన ఫలితాలను యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ(ఈఎస్‌సీ) హార్ట్ ఫెయిల్యూర్ జర్నల్ ప్రచురించింది. ఆస్పిరిన్ తీసుకునే వారిలో ఎక్కువ గుండెపోటు సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని తమ అధ్యయనంలో వెల్లడైందని ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయన రచయిత డాక్టర్ బ్లెరిమ్ ముజాజ్ చెప్పారు.దీంతో గుండె పోటుపై ఆస్పిరిన్ ప్రభావం వివాదాస్పదమైంది.


 ఈ అధ్యయనం గుండె జబ్బులు ఉన్నవారిలో,గుండె జబ్బులు లేనివారిలో గుండెపోటు సంభవంతో దాని సంబంధాన్ని అంచనా వేయడానికి ఉద్ధేశించింది.ఆస్పిరిన్ తీసుకున్న వారిలో గుండెపోటు ముప్పు 26 శాతం పెరిగిందని  వైద్యుల పరిశోధనల్లో వెల్లడైంది.‘‘ఈ ఫలితాలను ధృవీకరించడానికి గుండె పోటు  ప్రమాదం ఉన్న పెద్దల్లో బహుళజాతి రాండమైజ్డ్ ట్రయల్స్ అవసరం. అప్పటి వరకు ఆస్పిరిన్‌ను జాగ్రత్తగా సూచించాలి’’ అని బ్లెరిమ్ ముజాజ్ వైద్యులను కోరారు. 


Updated Date - 2021-11-24T18:19:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising