ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chinaకు తలవంచే ప్రసక్తి లేదన్న Taiwan

ABN, First Publish Date - 2021-10-10T17:22:03+05:30

చైనా విధించిన విధానాన్ని అంగీకరించే విధంగా నిర్బంధించడానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తైపేయి : చైనా విధించిన విధానాన్ని అంగీకరించే విధంగా నిర్బంధించడానికి వీల్లేకుండా రక్షణ రంగాన్ని పటిష్టపరచడం కొనసాగిస్తామని తైవాన్ ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్-వెన్ చెప్పారు. నేషనల్ డే సందర్భంగా ఆదివారం త్సాయ్ మాట్లాడుతూ, తైవాన్ ప్రజలు ఒత్తిడికి తలొగ్గుతారనే భ్రమలు ఎంతమాత్రం ఉండకూడదన్నారు. చైనాతో సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. తాము దురుసుగా వ్యవహరించబోమన్నారు. 


తమ జాతీయ భద్రత, రక్షణలను మరింత బలోపేతం చేసుకోవడానికి కృషిని కొనసాగిస్తామని చెప్పారు. తైవాన్ కోసం చైనా ఏర్పాటు చేసిన మార్గంలో నడిచే విధంగా తమను  ఎవరూ నిర్బంధించడానికి వీల్లేకుండా తమను తాము కాపాడుకోవడంకోసం తమ దృఢ నిశ్చయాన్ని ప్రదర్శిస్తూనే ఉంటామన్నారు. దీనికి కారణాలను వివరిస్తూ, చైనా తమ కోసం ప్రకటించిన విధానం ప్రకారం, తైవాన్ ప్రజలు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు, ప్రజాస్వామిక జీవన విధానంలో జీవించే అవకాశం లేదన్నారు. తైవాన్‌లోని 23 మిలియన్ల మంది ప్రజలకు సార్వభౌమాధికారాన్ని చైనా విధానం ఇవ్వడం లేదన్నారు. 


Updated Date - 2021-10-10T17:22:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising