ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేర్పాటునేత గిలానీ మృతదేహంపై పాక్ జెండా... కేసు నమోదు!

ABN, First Publish Date - 2021-09-05T13:32:15+05:30

వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ రాడికల్ ఫ్యాక్షన్ నేత...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ రాడికల్ ఫ్యాక్షన్ నేత సయ్యద్ అలీ షా గిలానీ బుధవారం కన్నుమూశారు. ఆ తరువాత గిలానీ మృతదేహానికి పాకిస్తాన్ జెండాతో చుట్టడంతో పాటు భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంపై బడ్గామ్ పోలీసులు అజ్ఞాత వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ సెప్టెంబరు ఒకటిన రాత్రి వేళ గిలానీ ఇంటి వద్ద చట్ట వ్యతికేక కార్యకలాపాలు చోటు చేసుకోవడంపై కేసు నమోదు చేశామన్నారు. 


గిలానీ మృతి అనంతరం కొందరు మహిళలు... పోలీసులతో గొడవకు దిగారన్నారు. ఆ తరువాత వారు గిలానీ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యుల దగ్గర నుంచి తీసుకువెళ్లి, ఖననం చేశారన్నారు. ఈ సందర్భంగా తీసిన ఒక వీడియోలో గిలానీ మృతదేహానికి పాకిస్తాన్ జెండా కప్పివుంచడం స్పష్టంగా కనిపించిందన్నారు. గిలానీ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ తన 91 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

Updated Date - 2021-09-05T13:32:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising