ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Switzerlandలో పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్‌‌కు ఆమోదం

ABN, First Publish Date - 2021-12-11T13:55:10+05:30

స్విట్జర్లాండ్ దేశంలో 5 నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్‌ వేయాలని ఆ దేశ సర్కారు నిర్ణయించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెనీవా : స్విట్జర్లాండ్ దేశంలో 5 నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్‌ వేయాలని ఆ దేశ సర్కారు నిర్ణయించింది.ఫైజర్-బయో ఎన్‌టెక్ వ్యాక్సిన్‌తో 5 నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు టీకాలు వేసేందుకు స్విస్ ఔషధాల ఏజెన్సీ స్విస్మెడిక్ ఆమోదం తెలిపింది.‘‘పిల్లలకు టీకా వేస్తే వారు సురక్షితంగా ఉంటారని క్లినికల్ ట్రయల్ ఫలితాలు చూపిస్తున్నాయి’’ అని స్విస్మెడిక్ ఒక ప్రకటనలో తెలిపింది.1500 మంది కంటే ఎక్కువ మంది పిల్లలపై చేపట్టిన క్లినికల్ ట్రయల్ కొవిడ్ వైరస్ వల్ల కలిగే తీవ్రమైన అనారోగ్యం నుంచి పూర్తి రక్షణను అందిస్తుందని స్విస్మెడిక్ తెలిపింది.టీకాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పిల్లల్లో తక్కువగా సంభవిస్తాయని, ఇంజెక్షన్ చేసిన చేతి వద్ద నొప్పి, అలసట లేదా తలనొప్పి, జ్వరం వంటివి ఉంటాయని స్విస్మెడిక్ ఏజెన్సీ తెలిపింది.


కొవిడ్ టీకాలను ఇప్పటివరకు 12 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మాత్రమే పరిమితం చేశారు.స్విట్జర్లాండ్ దేశం ప్రస్తుతం కరోనా ఐదవ వేవ్‌ను ఎదుర్కొంటోంది.ఐరోపాలోని పోర్చుగల్, ఇటలీ, గ్రీస్, స్పెయిన్‌లతో స్విట్జర్లాండ్ దేశాలు చిన్న  వయస్సు పిల్లలకు టీకాలు వేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.కెనడా, యునైటెడ్ స్టేట్స్,ఇజ్రాయెల్, చిలీ దేశాలు కూడా పిల్లలకు టీకాలు వేయడానికి అనుమతించాయి.ఫ్రాన్స్‌లో తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉన్న చిన్న పిల్లలకు మాత్రమే టీకాలు వేయాలని నిర్ణయించారు.  


Updated Date - 2021-12-11T13:55:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising