ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముకుల్ సభ్యత్వాన్ని రద్దు చేయండి: సువేందు డిమాండ్

ABN, First Publish Date - 2021-06-18T22:28:06+05:30

గౌరవనీయులైన స్పీకర్ గారికి, క్రిష్ణానగర్ ఉత్తర్ అసెంబ్లీ నియోజకవర్గం (83) నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ముకుల్ రాయ్‌ని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్ మీకు పంపిస్తున్నాను. దీనిపై వీలైనంత తొందరగా చర్యలు తీసుకోవాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: కొద్ది రోజుల క్రితం జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ టికెట్‌పై గెలిచి తాజాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ముకుల్ రాయ్‌ను శాసనసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి అన్నారు. ఈ విషయమై శుక్రవారం స్పీకర్ బిమాన్ బెనర్జీకి సువేందు పిటిషన్ పంపించారు. క్రిష్ణానగర్ ఉత్తర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ముకుల్ రాయ్‌ గెలుపొందారు.


‘‘గౌరవనీయులైన స్పీకర్ గారికి, క్రిష్ణానగర్ ఉత్తర్ అసెంబ్లీ నియోజకవర్గం (83) నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ముకుల్ రాయ్‌ని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్ మీకు పంపిస్తున్నాను. దీనిపై వీలైనంత తొందరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’’ అని స్పీకర్‌కు రాసిన లేఖలో సువేందు రాసుకొచ్చారు. దీనికి ముందు ఫిరాయింపు చట్టం నిబంధనలను అదిగమించి పార్టీ మారినందుకు గాను ముకుల్ రాయ్ రాజీనామా చేయాలని సువేందు డిమాండ్ చేశారు. బీజేపీ టికెట్‌పై గెలిచి టీఎంసీలోకి వెళ్లారని, అలా కాకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్లాలని సువేందు అన్నారు.

Updated Date - 2021-06-18T22:28:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising