ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నందిగ్రామ్ పోరు: 10న మమత, 12న సువేందు నామినేషన్

ABN, First Publish Date - 2021-03-08T23:44:58+05:30

దిగ్గజాల మధ్య పోరుగా చెబుతున్న నందిగ్రామ్‌లో ఒక్కసారిగా నామినేషన్ల వేడి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: దిగ్గజాల మధ్య పోరుగా చెబుతున్న నందిగ్రామ్‌లో ఒక్కసారిగా నామినేషన్ల వేడి పెరుగుతోంది. నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈనెల 10న నామినేషన్ వేస్తున్నట్టు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించగా, బీజేపీ అభ్యర్థిగా మమతను ఢీకొంటున్న సువేందు అధికారి 12వ తేదీన నామినేషన్ వేయనున్నట్టు ఆ పార్టీ సోమవారంనాడు ప్రకటించింది.


నందిగ్రామ్‌లో 2007లో చేపట్టిన భూ సేకరణ వ్యతిరేక ఉద్యమం మమతా బెనర్జీ‌తో పాటు సువేందు అధికారికి మంచి పేరు వచ్చింది. నిన్నటి వరకూ మమతా బెనర్జీ విధేయుడుగా ఉంటూ వచ్చిన సువేందు ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తన నియోజకవర్గమైన నందిగ్రామ్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. 2016లో ఇదే నియోజకవర్గం నుంచి ఆయన ఘనవిజయం సాధించారు. సువేందుకు గుణపాఠం చెప్పేందుకు నందిగ్రామ్ పోరులో ఈసారి తాను స్వయంగా తలపడనున్నట్టు మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించారు. కాగా, మమతపై 50,000 ఓట్లకు పైగా తేడాతో గెలుస్తానని సువేందు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ సైతం ఆయననే నందిగ్రామ్ నుంచి మమతకు పోటీగా బరిలోకి దింపడంతో పోటీ రసవత్తరంగా మారింది.

Updated Date - 2021-03-08T23:44:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising