ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

high alert : పాక్ సరిహద్దుల్లో మళ్లీ 3 డ్రోన్లు ప్రత్యక్షం

ABN, First Publish Date - 2021-07-30T13:24:01+05:30

జమ్మూకశ్మీరులోని సాంబా జిల్లా పాకిస్థాన్ సరిహద్దుల్లోని మూడు వేర్వేరు ప్రదేశాల్లో గురువారం రాత్రి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాంబా (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని సాంబా జిల్లా పాకిస్థాన్ సరిహద్దుల్లోని మూడు వేర్వేరు ప్రదేశాల్లో గురువారం రాత్రి మూడు అనుమానాస్పద డ్రోన్లు కనిపించాయి. సాంబా జిల్లా గజ్వాల్ పోలీసుస్టేషను ప్రాంతంలో మొదటి డ్రోన్ ను ఐటీబీపీ దళాలు, పోలీసులు గుర్తించారు.క్లియారీ ఇంటర్నేషనల్ సరిహద్దు ప్రాంతంలో రెండో డ్రోన్ ఎగరడాన్ని కనుగొన్నారు. బ్రహ్మ ప్రాంతంలో మూడో డ్రోన్ కనిపించింది. సాంబాలోని క్లియారీ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఎగిరిన అనుమానిత డ్రోన్ పై సరిహద్దు భద్రతా దళాలు కొన్ని రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ఆ డ్రోన్ పారిపోయింది. 


గురువారం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల మధ్య అంతర్జాతీయ సరిహద్దుల్లో అనుమానిత డ్రోన్లను గుర్తించారు.ఇలా పాక్ సరిహద్దుల్లో డ్రోన్లు కనిపించడం ఇది రెండో సారి. అనుమానిత డ్రోన్ల సంచారంతో సాంబా జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు.జులై 23వతేదీన అఖ్నూర్ ప్రాంతంలో ఐదు కిలోల పేలుడు పదార్థాలున్న డ్రోన్ ను జమ్మూకశ్మీర్ పోలీసులు కూల్చివేశారు. ఆగస్టు 15న స్వాతంత్ర్యదిన వేడుకలు జరగనున్నందున పాకిస్థాన్ సరిహద్దుల్లోని అన్ని భద్రతా సంస్థలను అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశించింది. 


Updated Date - 2021-07-30T13:24:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising