సూరత్‌లో ‘ఆమ్ ఆద్మీ’ విజయం వెనుక...
ABN, First Publish Date - 2021-02-24T13:05:20+05:30
గుజరాత్‌లోని సూరత్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ...
సూరత్: గుజరాత్‌లోని సూరత్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తన తొలి ప్రయత్నంలోనే నంబర్ టూ పార్టీగా అవతరించింది. సూరత్‌లో బీజేపీ తరువాత ఆప్ 27 సీట్లను దక్కించుకుని కాంగ్రెస్‌కు ఖాతా తెరిచేందుకు కూడా అవకాశం కల్పించలేదు. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఈ పార్టీ విజయం వెనుక పలు కారణాలున్నాయి. కాంగ్రెస్ ఏ పార్టీతోనూ జతకట్టలేదు. ఇక ఆప్ విషయానికొస్తే పార్టీ జిల్లా అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా సూరత్‌కు చెందిన వ్యక్తి.
అలాగే పాటీదార్ వర్గానికి చెందిన వ్యక్తి. ‘ఆప్’ విజయానికి పాటీదార్ల మద్దతు సహాయపడింది. తొలిసారిగా సూరత్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ తరపున నిలుచున్న అభ్యర్థులకు పాటీదార్ల మద్దతు విశేషంగా లభించింది. వీరంతా 2015లో పాటీదార్ సంరక్షణ ఆందోళనలో కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. ఇప్పుడు వీరంతా ఆమ్ ఆద్మీ విజయానికి సహకారం అందించారు. ఈ ఎన్నికల్లో పాటీదార్ సంరక్షణ సమితి సభ్యులు కాంగ్రెస్‌ను కొన్ని టెక్కెట్లు కోరగా, పార్టీ అందుకు నిరాకరించింది. ముగ్గురు పాటీదార్లకు కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చినా వారంతా పోటీకి సంబంధించిన దరఖాస్తు కూడా నింపలేదు. పైగా వీరంతా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం సాగించారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి లాభించింది.
Updated Date - 2021-02-24T13:05:20+05:30 IST