ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దక్షిణాఫ్రికా నుంచి సూరత్ వచ్చిన వ్యాపారికి Omicron variant

ABN, First Publish Date - 2021-12-14T12:56:00+05:30

గుజరాత్ రాష్ట్రంలో తాజాగా మరో ఒమైక్రాన్ వేరియెంట్ కరోనా కేసు వెలుగుచూసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూరత్ (గుజరాత్): గుజరాత్ రాష్ట్రంలో తాజాగా మరో ఒమైక్రాన్ వేరియెంట్ కరోనా కేసు వెలుగుచూసింది. ఓ వ్యాపారి డిసెంబరు 3వతేదీన దక్షిణాఫ్రికా నుంచి కెన్యా, అబుదాబీ దేశాల మీదుగా సూరత్ నగరానికి వచ్చారు. 42 ఏళ్ల సూరత్ వచ్చిన వ్యాపారికి ఒమైక్రాన్ వైరస్ సోకడంతో గుజరాత్ రాష్ట్రంలో ఒమైక్రాన్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది.గతంలో జింబాబ్వే నుంచి గుజరాత్ రాష్ట్రంలోని జాంనగర్ నగరానికి వచ్చిన 72 ఏళ్ల ప్రవాస భారతీయుడితోపాటు అతని భార్య, బావమరిదికి ఒమైక్రాన్ వేరియెంట్ సోకింది. దక్షిణాఫ్రికా దేశం నుంచి వచ్చిన వ్యాపారికి ఒమైక్రాన్ సోకడంతో సూరత్ నగరంలో కలకలం ఏర్పడింది. దక్షిణాఫ్రికా నుంచి కెన్యా, అబుదాబీ దేశాల మీదుగా ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన వ్యాపారికి ముందు కరోనా నెగిటివ్ అని వచ్చిందని సూరత్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ఆశిష్ నాయక్ చెప్పారు. 


డిసెంబరు 4వతేదీన రెండో సారి పరీక్ష చేసినా కరోనా లేదని రిపోర్టు వచ్చింది. అనంతరం సూరత్ వ్యాపారి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచి డిసెంబరు 8వతేదీన పరీక్ష చేసి శాంపిల్ ను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించగా కరోనా ఒమైక్రాన్ వేరియంట్ అని తేలింది. దీంతో వ్యాపారి బంధువులు, అతని తోటి ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ అని వచ్చింది. ఒమైక్రాన్ సోకిన వ్యాపారి హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నాడని వైద్యులు చెప్పారు. 


Updated Date - 2021-12-14T12:56:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising