ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాంతర జాతీయ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశించాలి: నానా పటోలె

ABN, First Publish Date - 2021-05-12T18:25:51+05:30

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కోవిడ్‌ నుంచి దేశాన్ని రక్షించడంలో విఫలమైందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కోవిడ్‌ నుంచి దేశాన్ని రక్షించడంలో విఫలమైందని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె ఆరోపించారు. సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకుని కోవిడ్ మేనేజిమెంట్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని, దీనికి తోడు మోదీ సర్కార్ వైఫల్యం దృష్ట్యా సమాంతర జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నారు. బుధవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, సమాంతర జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగంలో ప్రొవిజన్ ఉందని చెప్పారు.


బీజేపీ ఆడమన్నట్టు ఆడే కీలుబొమ్మగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తయారయ్యారంటూ తీవ్ర స్థాయిలో ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీపై విమర్శలు చేయడమే ఆయన పనిగా పెట్టుకున్నారని, గాంధీ కుటుంబాన్ని టార్కెట్ చేసుకుని రాజకీయాలు చేస్తున్నారని తప్పుపట్టారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కోసం రూ.20,000 కోట్లు ఖర్చుపెడుతున్నారని, వ్యాక్సినేషన్‌కు అవసరమైన నిధులు మాత్రం ఇవ్వడం లేదంటూ నానా పటోలె కేంద్రాన్ని ఎద్దేవా చేశారు.

Updated Date - 2021-05-12T18:25:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising