ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరమ్ బీర్ పిటిషన్‌కు సుప్రీం నో.. హైకోర్టుకు ముంబై మాజీ పోలీస్ చీఫ్..

ABN, First Publish Date - 2021-03-24T23:44:53+05:30

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ విచారణ జరిపించాలంటూ ముంబై మాజీ పోలీస్ చీఫ్ పరమ్ బీర్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ విచారణ చేపట్టాలంటూ ముంబై మాజీ పోలీస్ చీఫ్ పరమ్ బీర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. బోంబే హైకోర్టుకు వెళ్లాలంటూ ఆయనకు సూచించింది. మహారాష్ట్ర హోంమంత్రిపై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని ఈ సందర్భంగా సర్వోన్నత ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై సీబీఐ విచారణ కోసం బోంబే హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదంటూ పరమ్ బీర్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మహారాష్ట్ర హోంమంత్రిపై అంత సీరియస్ ఆరోపణలు చేసిన పరమ్ బీర్.. తన పిటిషన్‌లో సదరు మంత్రిని ఎందుకు ప్రతివాదిగా చేర్చలేదని కూడా సుప్రీం ప్రశ్నించింది. ‘‘మీరు స్వేచ్ఛగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు..’’ అంటూ ధర్మాసనం పేర్కొంది. దీంతో పరమ్‌బీర్ సింగ్ సుప్రీంకోర్టు నుంచి తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. తాను బోంబే హైకోర్టుకు వెళ్తానంటూ ఆయన పేర్కొన్నారు. కాగా ఇవాళ మధ్యాహ్నమే ఆయన బోంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. 

Updated Date - 2021-03-24T23:44:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising