ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవిత ఖైదుపై సుప్రీంకోర్టు వివరణ

ABN, First Publish Date - 2021-09-14T19:59:54+05:30

జీవిత ఖైదు అంటే సాధారణ జైలు శిక్ష కాదని, కఠిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : జీవిత ఖైదు అంటే సాధారణ జైలు శిక్ష కాదని, కఠిన కారాగారవాసమని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. ఈ విషయంలో చట్టం వైఖరిని పునఃపరిశీలించవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు, గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పులపై దాఖలైన రెండు అపీళ్ళ విచారణ సందర్భంగా జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఈ వివరణ ఇచ్చింది. 


ఈ సందర్భంగా నాయిబ్ సింగ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వం కేసులో 1983లో వచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ప్రస్తావించింది. శిక్ష స్వభావం గురించి వివరించే తీర్పులకు కొరత లేదని తెలిపింది. జీవిత ఖైదు అంటే కఠిన జీవిత ఖైదుతో సమానమని పరిగణించాలని నాయిబ్ సింగ్ కేసులో తీర్పు స్పష్టం చేస్తోందని పేర్కొంది. ఈ తీర్పును 1992లో కూడా వేరొక కేసులో సుప్రీంకోర్టు సమర్థించిందని తెలిపింది. ఈ విషయాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించలేదని కూడా పేర్కొంది. ఈ రెండు అపీళ్ళను తోసిపుచ్చింది.


Updated Date - 2021-09-14T19:59:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising