ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసు నిందితుడి ప్రేమికురాలికి రూ.50లక్షల గుర్రం కానుక!

ABN, First Publish Date - 2021-12-06T17:08:27+05:30

మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకే గుర్తు రెండాకుల కోసం కేంద్ర ఎన్నికల సంఘం అధికారికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించి అరెస్టయిన బ్రోకర్‌ సుఖేష్‌ చంద్రశేఖర్‌ తన ప్రియురాలికి రూ.50లక్షల విలువైన మేలిరకం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకే గుర్తు రెండాకుల కోసం కేంద్ర ఎన్నికల సంఘం అధికారికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించి అరెస్టయిన బ్రోకర్‌ సుఖేష్‌ చంద్రశేఖర్‌ తన ప్రియురాలికి రూ.50లక్షల విలువైన మేలిరకం గుర్రాన్ని, రూ.9 లక్షల పెంపుడు పిల్లిని కానుకలుగా ఇచ్చాడని వెల్లడైంది. 2019లో ఢిల్లీలోని స్టార్‌ హోటల్‌లో దాగిన బెంగళూరుకు చెందిన సుఖేష్‌  చంద్రశేఖర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అధికారులు అతడిపై ఏడు పేజీల ఛార్జీషీటును రూపొందించారు. చెన్నై కానత్తూరులోని బంగళాలో సుఖేష్‌ చంద్రశేఖర్‌ నివసించేవాడు.


ఆ సమయంలో లీనా మరియాపాల్‌ అనే యువతిని అతడు ప్రేమించాడు. ఆమె అడిగిన విలాసవస్తువులన్నీ కొని కానుకలుగా ఇచ్చేవాడు. ఆ మేరకు ప్రేమికురాలకి రూ. 50లక్షల విలువైన గుర్రాన్ని, రూ.9లక్షల విలువచేసే పెంపుడు పిల్లిని కానుకగా ఇచ్చాడు. ఈ వివరాలన్నీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం సమర్పించిన ఛార్జిషీట్‌లో వెల్లడైంది. సుఖేష్‌ చంద్రశేఖర్‌కు దేశంలోని పలువురు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలతో పరిచయాలున్నాయని, వారికి బ్రోకర్‌గా పనిచేసి కోట్లకు పడగెత్తాడని ఛార్జిషీటులో పేర్కొన్నారు.

Updated Date - 2021-12-06T17:08:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising