ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP:ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి ట్విట్టరు బయోడేటాలో పార్టీ పేరు తొలగింపు

ABN, First Publish Date - 2021-10-08T16:41:42+05:30

భారతీయ జనతాపార్టీ (బీజేపీ) జాతీయ కార్యనిర్వాహక మండలి నుంచి కేంద్ర మాజీమంత్రి, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి పేరును తొలగించిన నేపథ్యంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి తొలగించిన నేపథ్యంలో...

న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీ (బీజేపీ) జాతీయ కార్యనిర్వాహక మండలి నుంచి కేంద్ర మాజీమంత్రి, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి పేరును తొలగించిన నేపథ్యంలో ఆయన తన ట్విట్టరు ఖాతా బయోడేటా నుంచి బీజేపీ పార్టీ పేరును తొలగించారు. తన ట్విట్టరు బయోడేటాలో బీజేపీ జాతీయ కార్యనిర్వహణ సభ్యుడు అని ఉండగా, కార్యవర్గం నుంచి అతన్ని తొలగించాక సుబ్రహ్మణ్యం స్వామి తన బయోడేటాలోనూ పార్టీపేరు తొలగించారు.సుబ్రహ్మణ్యం స్వామి తన ట్విట్టర్ ఖాతా బయోడేటాలో ‘‘రాజ్యసభ ఎంపీ, కేంద్ర కేబినెట్ మాజీమంత్రి, ఎకనామిక్స్‌లో హార్వర్డ్ పీహెచ్‌డీ, ప్రొఫెసర్, నేను మంచిని ఇస్తాను.’’ అంటూ పెట్టారు. 


గతంలో సుబ్రహ్మణ్యం స్వామి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక విధానాలను తీవ్రంగా విమర్శించిన నేపథ్యంలో గురువారం బీజేపీ 80 మంది సభ్యుల జాతీయ కార్యవర్గం నుంచి తొలగించారు.లఖింపూర్ ఖేరీ హింసాకాండ సందర్భంగా కేంద్రం విధానాల గురించి వరుణ్ గాంధీ విమర్శించడంతో అతనితోపాటు తల్లి మేనకా గాంధీలను కూడా బీజేపీ కార్యవర్గం నుంచి తొలగించారు.కేంద్ర మంత్రులు రావు ఇందర్ జిత్ సింగ్, ప్రహ్లాద్ పటేల్, సురేష్ ప్రభు, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కుమారుడు దుష్యంత్ సింగ్, విజయ్ గోయల్, వినయ్ కటియార్, ఎస్ఎస్ అహ్లువాలియాలు కొత్త బీజేపీ కార్యవర్గ జాబితాలో బెర్త్ దొరకని వారిలో ఉన్నారు.


Updated Date - 2021-10-08T16:41:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising