ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇండియా-మయన్మార్ సరిహద్దుల్లో Strong earthquake

ABN, First Publish Date - 2021-11-26T12:47:39+05:30

ఇండియా-మయన్మార్ సరిహద్దుల్లో శుక్రవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఇండియా-మయన్మార్ సరిహద్దుల్లో శుక్రవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ కు తూర్పున 174 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైందని యూరోపియన్ మెడిటేరియన్ సీస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. ఈ భూకంపం ప్రభావం భారత్-మయన్మార్ సరిహద్దులోని పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాంలలో చూపింది.తూర్పు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాంలలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి.కోల్‌కతా, గౌహతిలోని చాలా ప్రాంతాల్లో భూకంపం దాదాపు 30 సెకన్ల పాటు వచ్చింది.చిట్టగాంగ్ లో భూమి బాగా కంపించిందని స్థానికులు చెప్పారు. 


భూకంప కేంద్రం ఈశాన్య భారతదేశంలోని ఐజ్వాల్‌కు ఆగ్నేయంగా 126 కి.మీ దూరంలో ఉందని భారత సీస్మోలజి సెంటర్ తెలిపింది.నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 5:15 గంటలకు భూకంపం 6.1 తీవ్రతతో సంభవించింది. భూకంప కేంద్రం మిజోరంలోని థెన్‌జాల్‌కు ఆగ్నేయంగా 12కిలోమీటర్ల దూరంలో 73కిలోమీటర్ల లోతులో ఉందని దేశంలో భూకంప కార్యకలాపాలను పర్యవేక్షించే కేంద్ర నోడల్ ఏజెన్సీ వివరించింది. 


Updated Date - 2021-11-26T12:47:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising