ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సారీ... పెళ్లికొడుకు నచ్చలేదు’

ABN, First Publish Date - 2021-12-08T17:04:33+05:30

పెళ్లికొడుకు తనకు నచ్చలేదంటూ ఆఖరి నిమిషంలో వివాహాన్ని పెళ్లికుమార్తె అడ్డుకోవడంతో బంధువులు దిగ్ర్భాంతి చెందారు. వేలూరు జిల్లా పాక్కంకు చెందిన షణ్ముఖప్రియ (25)కు కుచ్చిపాళయానికి చెందిన బాలమురుగన్‌ (31)కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆఖరి క్షణంలో వివాహం ఆపిన యువతి

చెన్నై/పెరంబూర్: పెళ్లికొడుకు తనకు నచ్చలేదంటూ ఆఖరి నిమిషంలో వివాహాన్ని పెళ్లికుమార్తె అడ్డుకోవడంతో బంధువులు దిగ్ర్భాంతి చెందారు. వేలూరు జిల్లా పాక్కంకు చెందిన షణ్ముఖప్రియ (25)కు కుచ్చిపాళయానికి చెందిన బాలమురుగన్‌ (31)కు గత నెల నిశ్చితార్థం జరగ్గా, సోమవారం వివాహం నిర్ణయించారు. పల్లికొండలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం రాత్రి పాట కచ్చేరి, వధూవరుల ఆహ్వాన వేడుకలు జరిగాయి. సోమవారం ఉదయం 9 గంటలకు వివాహం జరగాల్సిన తరుణంలో 6 గంటలకు తల్లిదండ్రులకు వద్దకు వెళ్లిన షణ్ముఖప్రియ.. తనకు పెండ్లి కొడుకు నచ్చలేదని, తాను వివాహం చేసుకోనని, బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది. దీంతో, దిగ్ర్భాంతి చెందిన తల్లిదండ్రులు, బంధువులు ఆమెను ఎంత బతిమిలాడినా అంగీకరించలేదు. దీంతో, ఇరుతరఫు పెద్దలు కూర్చొని మాట్లాడుకొని వివాహాన్ని నిలిపివేశారు. 

Updated Date - 2021-12-08T17:04:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising