ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఔరంగజేబుపై ఫేస్‌బుక్ పోస్ట్: రెచ్చిపోయిన అల్లరిమూక

ABN, First Publish Date - 2021-10-20T18:20:09+05:30

మొఘల్ చక్రవరి ఔరంగజేబ్‌కు వ్యతిరేకంగా ఫేస్‍‌బుక్‌లో వచ్చిన ఒక పోస్ట్‌పై అల్లరిమూక రెచ్చిపోయి రాళ్లు రువ్విన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మొఘల్ చక్రవరి ఔరంగజేబ్‌కు వ్యతిరేకంగా ఫేస్‍‌బుక్‌లో వచ్చిన ఒక పోస్ట్‌పై అల్లరిమూక రెచ్చిపోయి రాళ్లు రువ్విన ఘటన మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ సిటీలో చోటుచేసుకుంది. వాహనాలు, హోర్డింగ్‌లపై అల్లరిమూక రాళ్లు రువ్వడంతో వారిని అదుపుచేసేందుకు ప్రయత్నించిన నలుగురు పోలీసులు గాయపడ్డారు. విజయ్ చౌక్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు బుధవారంనాడు తెలిపారు.


''ఒక హోర్డింగ్, పోలీసు వాహనం, ఆటో రిక్షాను అల్లరి మూక ధ్వంసం చేసింది. అల్లర్లను నియంత్రించేందుకు ప్రయత్నించిన ఒక పోలీసు అధికారితో సహా నలుగురు పోలీసులు గాయపడ్డారు'' అని ఉస్మానాబాద్ సిటీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సురేష్ బుద్ధ్వంత్ తెలిపారు. 43 మందిపై కేసు నమోదు చేశామని, గుర్తుతెలియని మరో 150 నుంచి 170 మందిపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టామని మరో అధికారి తెలిపారు.

Updated Date - 2021-10-20T18:20:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising