ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...Omicron variantపై మోదీ హెచ్చరిక

ABN, First Publish Date - 2021-11-29T17:46:17+05:30

ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలకు గురి చేస్తున్న కొత్త కరోనావైరస్ వేరియంట్ ఓమైక్రాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రజలను కోరారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలకు గురి చేస్తున్న కొత్త కరోనావైరస్ వేరియంట్ ఓమైక్రాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రజలను కోరారు.పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మీడియా ప్రతినిధులను ఉద్ధేశించి ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు. ‘‘కరోనా మహమ్మారి సమయంలో మేం 100 కోట్ల డోస్‌లకు పైగా కొవిడ్ వ్యాక్సిన్లను వేశాం. ఇప్పుడు 150 కోట్ల డోస్‌ల వైపు వెళ్తున్నాం.’’ అని మోదీ చెప్పారు. కొత్త కరోనావైరస్ వేరియంట్ ఆవిర్భావం గురించి వెలువడుతున్న వార్తలు మమ్మల్ని మరింత అప్రమత్తం చేశాయన్నారు. 


కొవిడ్-19 యొక్క కొత్త వేరియంట్ దృష్ట్యా మనమందరం అప్రమత్తంగా ఉండాలని ప్రధాని కోరారు.దేశప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రాధాన్యం అని ప్రధాని అన్నారు. కొత్త వేరియెంట్ ప్రమాదం నేపథ్యంలో అంతర్జాతీయంగా వచ్చిన వారందరినీ పర్యవేక్షించాలని ప్రధాని అధికారులను కోరారు. అంతర్జాతీయ ప్రయాణ పరిమితుల సడలింపు ప్రణాళికలను సమీక్షించాలని ఆయన అధికారులను కోరారు. 


Updated Date - 2021-11-29T17:46:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising