ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడు సీఎంగా 7న స్టాలిన్‌ ప్రమాణం

ABN, First Publish Date - 2021-05-04T07:32:01+05:30

తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ఈ నెల ఏడో తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే శాసనసభాపక్ష సమావేశం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, మే 3 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ఈ నెల ఏడో తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే శాసనసభాపక్ష సమావేశం మంగళవారం జరుగనుంది. నూతన ఎమ్మెల్యేలంతా స్టాలిన్‌ను తమ నేతగా లాంఛనంగా ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలని పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలందరికీ డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌ ఆదేశాలు జారీ చేశారు. కాగా.. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో స్టాలిన్‌, ఆయన కేబినెట్‌ సహచరులు 7వ తేదీ సాయంత్రం రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా ప్రమాణం చేయనున్నారు. ఇంకోవైపు.. డీఎంకే కూటమి తిరుగులేని విజయం నేపథ్యంలో స్టాలిన్‌ ఆదివారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత స్థానిక మెరీనాతీరంలో ఉన్న తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఎమ్మెల్యేగా తను గెలిచినట్లు ఇచ్చిన ధ్రువీకరణపత్రాన్ని సమాధిపై ఉంచారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. సోమవారం ఉదయం తన తల్లిదండ్రుల నివాసమైన గోపాలపురంలోని ఇంటికి వెళ్లారు. అక్కడ తన మాతృమూర్తి దయాళు అమ్మాళ్‌ ఆశీస్సులు అందుకున్నారు. కాన్వాయ్‌లో వెళ్తూ.. రోడ్డుపై నడిచి వెళ్తున్న తన చిన్ననాటి స్నేహితుడు బాలచంద్రన్‌ను చూసి వాహనాన్ని ఆపారు. ఆయన క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. తర్వాత తనను కలవాలంటూ భుజం తట్టి ముందుకు సాగిపోయారు. 


ఎడప్పాడి రాజీనామా

శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే పరాజయం పాలవడంతో ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్‌ కార్యాలయానికి ఫ్యాక్స్‌ ద్వారా పంపించారు. ఆయన రాజీనామాను ఆమోదించిన గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌.. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు పదవిలో కొనసాగాలని కోరారు. 


Updated Date - 2021-05-04T07:32:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising