ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టిన స్టాలిన్

ABN, First Publish Date - 2021-08-28T21:26:25+05:30

కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఒక తీర్మానాన్ని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఒక తీర్మానాన్ని శనివారంనాడు రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కేంద్ర చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని, రాష్ట్రాలను సంప్రదించకుండా ఏకపక్షంగా కేంద్రం ఈ చట్టాలను ఆమోదించిందని ఈ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడుతూ స్టాలిన్ అన్నారు. దేశంలో వ్యవసాయ వృద్ధికి కాని, రైతుల ఎదుగుదలకు కానీ సాగు చట్టాలు ఏమాత్రం ఉపకరించవని అన్నారు. కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వ్యవసాయం వెళ్లకుండా ఈ చట్టాలను రద్దు చేయాలని కేంద్రాన్ని ఆయన కోరారు. వ్యవసాయరంగాన్ని మెరుగుపరచేందుకు, రైతుల జీవన స్థితిగతులను మెరుగుపరచేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ తెచ్చిందని, ఇది తమిళనాడు చరిత్రలోనే మొదటిసారని సీఎం తెలిపారు.


రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేలా మార్కెట్లను మనం రెగ్యులేట్ చేస్తున్నామని, వాటిని లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు సాగు చట్టాలను తెచ్చిందని స్టాలిన్ అన్నారు. రాష్ట్రాలను సంప్రదించకుండా తెచ్చిన చట్టాలు సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకమని, అందువల్ల తాము ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాల హక్కులను హరించడం, ప్రజాస్వామ్య వ్యవస్థల గౌరవాన్ని నాశనం చేయడం సరికాదన్నారు. శాంతియుతంగా నిరసనలు సాగిస్తున్న రైతులకు సంఘీభావంగా తమిళనాడు ప్రభుత్వం ఈ తీర్మానం తెచ్చిందని చెప్పారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిగా ఆందోళన చేస్తున్న రైతులపై నమోదు చేసిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు. స్టాలిన్ ఈ తీర్మానం ప్రవేశపెట్టగానే అన్నాడీఎంకే, బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌంట్ చేశారు.


ఓపీఎస్ వాదన...

కాగా, సాగు చట్టాలపై ప్రతికూలతలను ముఖ్యమంత్రి ఏకరవు పెట్టారని, అయితే ఇదే సమయంలో ప్రయోజనాలను కూడా చెప్పాల్సిన అవసరం ఉందని అన్నాడీఎంకే నేత ఓ.పన్నీర్‌సెల్వం వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై కేంద్రానికి తెలియజేసిందా, అందుకు ఏదైనా సమాధానం వచ్చిందా అనేది తాను తెలుసుకోవాలనుకుంటున్నానని అన్నారు.

Updated Date - 2021-08-28T21:26:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising