ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీలంక Jail నుంచి తమిళ జాలర్ల విడుదల

ABN, First Publish Date - 2021-11-28T14:18:13+05:30

పొరపాటున శ్రీలంక సముద్ర ప్రాంతంలో చేపలవేటకు వెళ్లి అరెస్టయిన నాగపట్టణం జాలర్లను అక్కడి న్యాయస్థానం విడుదల చేసింది. వారు విమానం ద్వారా శనివారం ఉదయం నగరానికి చేరుకున్నారు. నాగపట్టణం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై): పొరపాటున శ్రీలంక సముద్ర ప్రాంతంలో చేపలవేటకు వెళ్లి అరెస్టయిన నాగపట్టణం జాలర్లను అక్కడి న్యాయస్థానం విడుదల చేసింది. వారు విమానం ద్వారా శనివారం ఉదయం నగరానికి చేరుకున్నారు. నాగపట్టణం జిల్లా అక్కరపేట జాలర్లు గ్రామం నుంచి గత అక్టోబరు 13వ తేది సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సమయంలో లంక నావికాదళ సిబ్బంది వారిని చుట్టుముట్టి, సరిహద్దులు దాటారన్న కారణంగా వారు వెళ్లిన రెండు పడవలు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో చేపలవేటలో పాల్గొన్న 23 మందిని అరెస్టు చేసి లంక జైలుకు తరలించారు. దీనిపై బాధిత జాలరుల కుటుంబాల విజ్ఞప్తి మేరకు కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ కృషి వల్ల కేంద్రప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వంతో చర్చించింది. శ్రీలంక పాయింట్‌ మెట్రో న్యాయస్థానంలో కొనసాగిన ఈ కేసు విచారణ పూర్తవడంతో శుక్రవారం ఆ 23 మంది జాలర్లను జైలు నుంచి విడుదల చేస్తూ తీర్పు వెలువడింది. దీంతో విడుదలైన జాలర్లు శనివారం తెల్లవారుజామున 4 గంటలకు విమానంలో స్థానిక మీనంబాక్కం విమానాశ్రయానికి వచ్చి చేరారు. వారిని బీజేపీ జాలర్ల విభాగం నిర్వాహకులు స్వాగతించారు. ఈ సందర్భంగా జాలర్లు మీడియాతో మాట్లాడుతూ... శ్రీలంక జైలు నుంచి తమను విడుదల చేయించిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-11-28T14:18:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising