ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీలంకలో అరెస్టయిన భారతీయ మత్స్యకారుల విడుదల

ABN, First Publish Date - 2021-03-27T20:18:31+05:30

ఇటీవల అరెస్టు చేసిన భారతీయ మత్స్యకారులను శ్రీలంక విడుదల చేసింది. శ్రీలంక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబో : ఇటీవల అరెస్టు చేసిన భారతీయ మత్స్యకారులను శ్రీలంక విడుదల చేసింది. శ్రీలంక ప్రాదేశిక జలాల్లో అక్రమంగా చేపలను వేటాడుతున్నారనే ఆరోపణలపై వీరిని శ్రీలంక నావికా దళం అరెస్టు చేసింది. శుక్రవారం 40 మందిని, శనివారం 14 మందిని శ్రీలంక విడుదల చేసినట్లు భారత ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. 


శ్రీలంక ఉత్తర, ఈశాన్య సముద్ర జలాల్లో మార్చి 24న 54 మంది భారతీయ మత్స్యకారులను శ్రీలంక నావికా దళం అరెస్టు చేసింది. వీరు తమ ప్రాదేశిక జలాల్లో అక్రమంగా చేపలను వేటాడుతున్నట్లు ఆరోపించింది. వీరి నుంచి ఐదు ట్రాలర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఈ సమాచారం అందిన తర్వాత శ్రీలంకలోని ఇండియన్ హైకమిషన్ స్పందిస్తూ,  అరెస్టయినవారికి దౌత్యపరమైన సహాయం అందజేస్తున్నట్లు తెలిపింది. ఈ అంశంపై మానవతావాదంతో వ్యవహరించాలని కోరింది. ద్వైపాక్షిక యంత్రాంగాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. 


Updated Date - 2021-03-27T20:18:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising