ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింహానికి కరోనా.. భారత్ సాయం కోరిన శ్రీలంక

ABN, First Publish Date - 2021-06-20T05:13:29+05:30

శ్రీలంక జూలోని ఓ సింహం కరోనా బారిన పడటంతో తగు చికిత్స అందించేందుకు శ్రీలంక తాజాగా భారత్ సాయాన్ని కోరింది. చికిత్సకు సంబంధించి తగు సూచనలు సలహాలూ ఇవ్వాలని భారత్ సెంట్రల్ జూ అథారిటీకి విజ్ఞప్తి చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబో: శ్రీలంక జూలోని ఓ సింహం కరోనా బారిన పడటంతో తగు చికిత్స అందించేందుకు శ్రీలంక తాజాగా భారత్ సాయాన్ని కోరింది. చికిత్సకు సంబంధించి తగు సూచనలు సలహాలూ ఇవ్వాలని భారత్ సెంట్రల్ జూ అథారిటీకి విజ్ఞప్తి చేసింది. 2013లో దక్షిణకొరియా ఈ సింహాన్ని శ్రీలంకకు బహూకరించింది. దీని వయసు ప్రస్తుతం 9 ఏళ్లు. శ్వాసతీసుకోవడంలో సింహం ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించిన అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని వచ్చింది. దీంతో.. వెంటనే వారు చికిత్స కోసం భారత్‌ను సంప్రదించారు. అంతేకాకుండా.. అదే జూలో ఉన్న ఇతర సింహాలను, వాటిని పర్యవేక్షిస్తున్న సిబ్బందిని శ్రీలంక జూ అధికారులు క్వారంటైన్ చేశారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు భారత‌ పర్యటకులను తమ దేశంలోకి అనుమతించబోమని శ్రీలంక గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. 


Updated Date - 2021-06-20T05:13:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising