ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా టీకాలకు నో.. ఆస్ట్రాజెనెకా టీకాల దిగుమతి.. శ్రీలంక కీలక నిర్ణయం

ABN, First Publish Date - 2021-02-24T00:06:22+05:30

రెండో విడత టీకా కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్న శ్రీలంక..ఈ మారు చైనా టీకాలను వద్దనుకుంటోంది. అందుకు బదులుగ ఆస్ట్రాజెనెకా టీకాలను దిగుమతి చేసుకునేందుకు నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబో: రెండో విడత టీకా కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్న శ్రీలంక..ఈ మారు చైనా టీకాలను వద్దనుకుంటోంది. అందుకు బదులుగా ఆస్ట్రాజెనెకా టీకాలను దిగుమతి చేసుకునేందుకు నిర్ణయించింది. శ్రీలంక ఉద్యానవన శాఖ మంత్రి రమేశ్ పథిరణ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. 13.5 మిలియన్ టీకాలను దిగుమతి చేసుకునేందుకు ఆర్డర్ పెట్టినట్టు ఆయన పేర్కొన్నారు. రెండో విడత టీకా పంపిణీ కోసం రష్యా, చైనా టీకాలు తయారు కాలేదని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన ఫలితాలను చైనా కంపెనీ ఇప్పటికీ శ్రీలంక ప్రభుత్వానికి సమర్పించలేదన్నారు. క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలపై చైనా గోప్యత పాటిస్తోందని ఇప్పటికే పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా.. తొలి విడత టీకా కార్యక్రమంలో కోసం శ్రీలంక గతంలోనే 10 మిలియన్ డోసులను భారత్ నుంచి దిగుమతి చేసుకుంది. అయితే.. అంతకుమునుపే భారత్ శ్రీలంకకు 50 వేల డోసులను బహుమతిగా ఇచ్చింది. దీంతో... శ్రీలంక అధ్యక్షుడు భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

Updated Date - 2021-02-24T00:06:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising