ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీలంకలో ‘ఒక దేశం-ఒకే చట్టం’ కోసం కమిటీ ఏర్పాటు

ABN, First Publish Date - 2021-10-28T00:51:15+05:30

‘ఒక దేశం-ఒకే చట్టం’ కోసం 13 మంది సభ్యులతో ఓ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబో : ‘ఒక దేశం-ఒకే చట్టం’ కోసం 13 మంది సభ్యులతో ఓ టాస్క్‌ఫోర్స్‌ను శ్రీలంక దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స నియమించారు. ముస్లిం వ్యతిరేక వైఖరిని బాహాటంగా ప్రదర్శించే బౌద్ధ సన్యాసి నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.  2019 ఎన్నికల్లో ఆయన ‘ఒక దేశం-ఒకే చట్టం’ నినాదంతో బౌద్ధుల మద్దతు పొందారు.


శ్రీలంకలో బౌద్ధులు అత్యధికంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో రాజపక్స ‘ఒక దేశం-ఒకే చట్టం’ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. దీంతో బౌద్ధుల మద్దతు అధికంగా లభించి, ఆయన విజయం సాధించారు. 


‘ఒక దేశం-ఒకే చట్టం’ ముసాయిదాను రూపొందించడం కోసం బౌద్ధ సన్యాసి గలగొడాత్థే జ్ఞానసార నేతృత్వంలో 13 మంది సభ్యులతో ఓ టాస్క్‌ఫోర్స్‌ను ప్రత్యేక గెజిట్ ద్వారా దేశాధ్యక్షుడు రాజపక్స ఏర్పాటు చేశారు. జ్ఞానసార ముస్లిం వ్యతిరేకతకు చిహ్నంగా పేరు పొందారు. ఈ కమిటీలో నలుగురు ముస్లింలు కూడా ఉన్నారు. అయితే మైనారిటీలైన తమిళులకు మాత్రం ఈ కమిటీలో స్థానం కల్పించలేదు. 


ఇస్లామిక్ అతివాదం పెరుగుతున్న నేపథ్యంలో సింహళ మెజారిటీ ప్రజల మద్దతును సాధించేందుకు ‘ఒక దేశం-ఒకే చట్టం’ నినాదాన్ని శ్రీలంక పొదుజన పెరమున ప్రచారం చేసింది. షరియా చట్టాన్ని ఆచరించడం వల్ల ముస్లిం అతివాదం పెరుగుతోందని జాతీయవాదులు ఆరోపిస్తున్నారు. ఈ నినాదానికి మరింత ఊపు రావడానికి కారణాల్లో ఒకటి... 2019లో ఈస్టర్ రోజున జరిగిన ఆత్మాహుతి దాడులు. ఈ దాడుల్లో సుమారు 270 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 11 మంది భారతీయులు కూడా ఉన్నారు. ఈ దాడులకు బాధ్యత నేషనల్ థవ్హీద్ జమాత్ అనే ఇస్లామిక్ సంస్థ అనే ఆరోపణలు వచ్చాయి. 


Updated Date - 2021-10-28T00:51:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising