ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పుత్నిక్ వ్యాక్సిన్‌కు నిపుణుల కమిటీ పచ్చజెండా

ABN, First Publish Date - 2021-04-12T23:45:13+05:30

ఓ వైపు కరోనా సెకండ్ వేవ్... మరో వైపు భారీగా పెరుగుతున్న కేసులు, ఇంకో వైపు వ్యాక్సిన్ కొరత అంటూ విమర్శ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఓ వైపు కరోనా సెకండ్ వేవ్... మరో వైపు భారీగా పెరుగుతున్న కేసులు, ఇంకో వైపు వ్యాక్సిన్ కొరత అంటూ విమర్శలు... ఈ నేపథ్యంలో ప్రజలకు ఊరట కలిగించే అంశం ఒకటి వచ్చింది.  భారత్‌లో మరో వ్యాక్సిన్‌కు అనుమతి లభించింది. రష్యా అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్-వి’ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం నిపుణుల కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. త్వరలోనే టీకా ఉత్పత్తి చేసి, వినియోగంలోకి తీసుకురానున్నారు. డీజీసీఐ అనుమతి లభిస్తే మాత్రం మూడో వ్యాక్సిన్‌గా స్పుత్నిక్ నిలుస్తుంది. ఇప్పటికే కొవాగ్జిన్, కోవిషీల్డ్‌ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాల్సిందిగా డాక్టర్ రెడ్డీస్ దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నిపుణుల కమిటీ దీనిపై చర్చించింది. ఆ తర్వాత వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ పచ్చ జెండా ఊపింది. 

Updated Date - 2021-04-12T23:45:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising