ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యాచారం కేసులో ఎస్‌పీ, బీఎస్‌పీ నేతల అరెస్టు

ABN, First Publish Date - 2021-10-17T02:01:23+05:30

పదిహేడేళ్ల బాలికపై అత్యాచారం కేసులో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ లలిత్‌పూర్ జిల్లా అధ్యక్షులతో సహా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: పదిహేడేళ్ల బాలికపై అత్యాచారం కేసులో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్‌ పార్టీ లలిత్‌పూర్ జిల్లా అధ్యక్షులతో సహా ఏడుగురిని అరెస్టు చేసినట్టు ఉత్తరప్రదేశ్ పోలీసులు శనివారంనాడు తెలిపారు. గత ఐదేళ్లుగా తనపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులతో సహా 25 మంది అత్యాచారాలకు పాల్పడినట్టు బాలిక చేసిన ఫిర్యాదుతో ఈ అరెస్టులు చేశామని పోలీస్ సూపరింటెండెంట్ నిఖిల్ పాఠక్ తెలిపారు. బాధితురాలి తండ్రి, మేనమామ, ముగ్గురు అజ్ఞాత వ్యక్తులు సహా అందరిపైనా కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో అక్టోబర్ 12న కేసు నమోదైందని అన్నారు. మీర్జాపూర్ జిల్లాలోని ఓ హోటల్‌పై శుక్రవారం దాడులు జరిపి లలిత్‌పూర్ సమాజ్‌వాదీ పార్టీ జిల్లా చీఫ్ తిలక్ యాదవ్, బీఎస్‌పీ జిల్లా చీఫ్ దీపక్ అహిర్‌వర్, మహేంద్ర డూబే అనే ఒక ఇంజనీర్‌ను అరెస్టు చేసి స్థానిక కోర్టు ముందు హాజరుపరిచామని నిఖిల్ పాఠక్ తెలిపారు. వీరిని 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీకి కోర్టు ఆదేశించిందని చెప్పారు. కాగా, ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను ఇంతకుముందే అరెస్టు చేశారు.

Updated Date - 2021-10-17T02:01:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising