ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

South Africa నుంచి థానేకు వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్

ABN, First Publish Date - 2021-11-29T13:45:44+05:30

దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడికి కరోనా వైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసోలేషన్‌కు తరలింపు

థానే (మహారాష్ట్ర): దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడికి కరోనా వైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది.ఓమైక్రాన్ వేరియెంట్ సోకిన దక్షిణాఫ్రికా దేశం నుంచి మహారాష్ట్రలోని థానే జిల్లా డోంబివిలీ ప్రాంతానికి కొవిడ్-19 పాజిటివ్ ప్రయాణికుడు వచ్చాడు. కరోనా సోకిన దక్షిణాఫ్రికా ప్రయాణికుడికి ఓమైక్రాన్ వేరియంట్‌ కరోనా వైరస్‌ ఉందో   లేదో తెలుసుకోవడానికి అతని నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. దక్షిణాఫ్రికాలో భయంకరమైన ఓమైక్రాన్ వేరియెంట్ ప్రబలిన నేపథ్యంలో కరోనా పాజిటివ్ ప్రయాణికుడిని కల్యాణ్ డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ట్ గ్యాలరీ ఐసోలేషన్ సెంటరుకు తరలించారు.ఈ కరోనా రోగి నవంబర్ 24న దక్షిణాఫ్రికా నుంచి ఢిల్లీకి వచ్చి, ఆపై ముంబైకు వెళ్లారు. 


దక్షిణాప్రికాకు చెందిన కరోనా రోగి పరిస్థితి నిలకడగా ఉందని కెడిఎంసీ ఆరోగ్య అధికారి డాక్టర్ ప్రతిభా పాన్‌పాటిల్ తెలిపారు. రోగి సోదరుడికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది.రోగి యొక్క ఇతర కుటుంబ సభ్యులకు సోమవారం కొవిడ్ -19 పరీక్షలు చేస్తామని పాటిల్ చెప్పారు. ప్రస్తుతం రోగి కుటుంబసభ్యులు కూడా ఐసోలేషన్‌లో ఉన్నారు.శనివారం, బెంగళూరులో దక్షిణాఫ్రికాకు చెందిన ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్ -19 పాజిటివ్ వచ్చింది. అయితే వారికి ఓమైక్రాన్ కాకుండా డెల్టా స్ట్రెయిన్ ఆఫ్ కరోనావైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది.


Updated Date - 2021-11-29T13:45:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising