ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

South Africa అధ్యక్షుడికి ఒమైక్రాన్ వేరియెంట్

ABN, First Publish Date - 2021-12-13T12:36:16+05:30

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాకు కొవిడ్ ఒమైక్రాన్ వేరియెంట్ సోకింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జోహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాకు కొవిడ్ ఒమైక్రాన్ వేరియెంట్ సోకింది. దేశ అధ్యక్షుడికి ఒమైక్రాన్ వేరియెంట్ పాజిటివ్ పరీక్షించిన తర్వాత  చికిత్స పొందుతున్నారని అతని కార్యాలయం తెలిపింది.రమాఫోసా అనారోగ్యంతో బాధపడుతుండటంతో కొవిడ్ పరీక్ష చేయగా ఒమైక్రాన్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది.అధ్యక్షుడు కేప్ టౌన్‌లో స్వీయ నిర్బంధంలో ఉన్నారని, దక్షిణాఫ్రికా మిలిటరీ హెల్త్ సర్వీస్ ఆయన చికిత్సను పర్యవేక్షిస్తున్నట్లు ఆ దేశం తెలిపింది. రమాఫోసాకు కొవిడ్ సోకిన నేపథ్యంలో డిప్యూటీ ప్రెసిడెంట్ డేవిడ్ మబుజాకు అన్ని బాధ్యతలను అప్పగించారు.


అధ్యక్షుడికి రెండు డోసుల టీకాలు తీసుకున్నా ఒమైక్రాన్ బారిన పడ్డారని వైద్యులు చెప్పారు.గత వారం రామఫోసా నాలుగు పశ్చిమ ఆఫ్రికా దేశాలను సందర్శించారు. ఈ పర్యటనలో అతని ప్రతినిధి బృందంలోని సభ్యులందరికీ కొవిడ్ పరీక్షలు చేశారు.ప్రతినిధి బృందంలోని కొందరు సభ్యులకు నైజీరియాలో పాజిటివ్ అని తేలడంతో వారు నేరుగా దక్షిణాఫ్రికాకు తిరిగి వచ్చారు. రామఫోసా డిసెంబర్ 8న సెనెగల్ నుంచి తిరిగి వచ్చారు.దక్షిణాఫ్రికాలో రమాఫోసాతో పరిచయం ఉన్న వ్యక్తులు కూడా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని దక్షిణాఫ్రికా వైద్యులు  సూచించారు. అధ్యక్షుడితో పాటు దేశంలో ఒమైక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. 


Updated Date - 2021-12-13T12:36:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising