ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దక్షిణాఫ్రికాలో కరోనా ఫోర్త్ వేవ్.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఒమైక్రాన్

ABN, First Publish Date - 2021-12-08T02:59:16+05:30

కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్ ఇప్పుడు సౌతాఫ్రికాను వణికిస్తోంది. ఫోర్త్‌వేవ్‌తో ప్రజలు భయాందోళనల మధ్య గడుపుతున్నారు. రోజురోజుకు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జొహన్నెస్‌బర్గ్: కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్ సౌతాఫ్రికాను వణికిస్తోంది. దేశంలో కరోనా నాలుగో వేవ్ ప్రవేశించిందని ఆ దేశ ఆరోగ్య మంత్రి జోయ్ పాహ్లా ఈ నెల 3న ప్రకటించిన తర్వాత ప్రజల్లో భయాందోళనలు మరింత ఎక్కువయ్యాయి. ఇప్పటికే అక్కడ ప్రతి రోజు కరోనా కేసులు పెద్ద సంఖ్యలో వెలుగుచూస్తున్నాయి. ప్రతి నలుగురిలో ఒకరు వైరస్ బారినపడుతున్నారు. ఒమైక్రాన్ వెలుగు చూసిన తర్వాత గత వారం రోజుల్లోనే బాధితుల సంఖ్య ఐదు రెట్లు పెరగడంపై ఆ దేశాధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఆందోళన వ్యక్తం చేశారు.


ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్‌లు వెలుగుచూసినప్పుడు ఫోర్త్ వేవ్ ఊహించినదేనని అధ్యక్షుడు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరు టీకాలు తీసుకోవాలని కోరారు. కాగా, రెండు వారాల క్రితం దక్షిణాఫ్రికాలో రెండుశాతంగా ఉన్న పాజిటివిటీ శాతం ప్రస్తుతం 25 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశం నాలుగో వేవ్‌లోకి ప్రవేశించిన నేపథ్యంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నట్టు సిరిల్ పేర్కొన్నారు.

Updated Date - 2021-12-08T02:59:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising