ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ నుంచి కోలుకుంటే.. మిగతా కరోనా స్ట్రెయిన్లు దరిచేరవు’

ABN, First Publish Date - 2021-03-04T03:46:33+05:30

దక్షిణాఫ్రికా కరోనా స్ట్రెయిన్ నుంచి కోలుకుంటే..ఇతర స్ట్రెయిన బారిన పడే అవకాశాలు సన్నగిల్లుతాయని ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. దక్షిణాఫ్రియా స్ట్రెయిన్ నుంచి కోలుకున్న వారిలోని రోగ నిరోధక శక్తి ఇతర స్ట్రెయిన్లను సమర్థంగా అడ్డుకోగలదని తేలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా కరోనా స్ట్రెయిన్ నుంచి కోలుకుంటే..ఇతర స్ట్రెయిన్ల బారిన పడే అవకాశాలు తగ్గిపోతాయని దక్షిణాఫ్రికాలో ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. దక్షిణాఫ్రియా స్ట్రెయిన్ నుంచి కోలుకున్న వారిలోని రోగ నిరోధక శక్తి ఇతర స్ట్రెయిన్లను సమర్థంగా అడ్డుకోగలదని తేలింది. దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు బుధవారం నాడు తాము చేపట్టిన ఈ అధ్యయనం తాలూకు వివరాలు వెల్లడించారు. దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌ను శాస్త్రపరిభాషలో 501వై.వీ2 అని పిలుస్తారు. కాగా.. ఈ స్ట్రెయిన్ ఆధారంగా రూపొందిన టీకాలు ఇతర స్ట్రెయిన్లను సమర్థవంతంగా ఎదుర్కోగలవని ఈ కొత్త అధ్యయనం సూచిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ అధ్యయనాన్ని దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ మంత్రి మానవాళికి శుభవార్తగా అభివర్ణించారు. టీకా కార్యక్రమం ప్రారంభమైందన్న ఆనందం ఈ కొత్త కరోనా స్ట్రెయిన్ల కారణంగా ఆవిరైపోతున్న విషయం తెలిసిందే. కొత్త స్ట్రెయిన్లను ప్రస్తుతమున్న టీకాలు అడ్డుకోలేవన్న భయాలు ప్రజల్లో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో..దక్షిణాప్రికా శాస్త్రవేత్తల అధ్యయనం కొత్త ఆశలు చిగురించేలా చేస్తోంది.   

Updated Date - 2021-03-04T03:46:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising