ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఛాతీ నొప్పితో మళ్లీ ఆసుపత్రిలో చేరిన గంగూలీ

ABN, First Publish Date - 2021-01-27T21:15:24+05:30

టీమిండియా మాజీ కెప్టెన్, బీబీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మళ్లీ కోల్‌కతాలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్, బీబీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మళ్లీ కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను బుధవారంనాడు అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈనెల 2న ఆయనకు స్వల్పంగా గుండెపోటు రావడంతో వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో చేర్చగా, అక్కడ యాంజియోప్లాస్టీ నిర్వహించి ఒక స్టెంట్ వేశారు. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నారని నిర్ధారించిన తర్వాత ఈ నెల ప్రథమార్థంలోనే ఆయనను డిశ్చార్చి చేశారు. అయితే, గుండెలో మరో రెండు బ్లాక్స్‌ ఉన్నాయని, వీటికి కూడా త్వరలో యాంజియో ప్లాస్టీ నిర్వహించాలని వైద్యులు ఆ సమయంలో సూచించారు.


కాగా, గంగూలీ ఆరోగ్యంపై ఆందోళన వద్దని ఆయనకు వైద్య చికిత్స అందిస్తున్న వైద్య బృందంలోని ప్రఖ్యాత కార్డియాక్ సర్జన్ డాక్టర్ దేవి షెట్టి చెప్పారు. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయనను అపోలో ఆసుపత్రికి తీసుకువచ్చినట్టు ఆయన తెలిపారు. 'పెద్ద సమస్య ఏమీ లేదు. సహజంగా చాలా మంది భారతీయులు ఏదో ఒక సమయంలో కరోనరీ ఆర్టెరీ బ్లాకేజ్ సమస్యలు ఎదుర్కొంటుంటారు. హార్డ్ డ్యామేజీ ఏమీ లేదు. సరైన సమయంలో సరైన ఆసుపత్రిలో చేరినందున సరైన చికిత్స అందుతుంది' అని షెట్టి చెప్పారు.

Updated Date - 2021-01-27T21:15:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising