ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబ్‌లో మార్పులపై సోనియా ఇంకా నిర్ణయం తీసుకోలేదు: రావత్

ABN, First Publish Date - 2021-07-16T22:06:06+05:30

పంజాబ్‌ కాంగ్రెస్‌లో ప్రతిపాదిత మార్పులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పంజాబ్‌ కాంగ్రెస్‌లో ప్రతిపాదిత మార్పులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పంజాబ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జి హరీష్ రావత్ తెలిపారు. సోనియాగాంధీతో శుక్రవారం సమావేశమైన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  సమావేశంలో పార్టీ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా పాల్గొన్నారు.


''పార్టీ అధ్యక్షురాలికి నోట్ సమర్పించేందుకు నేను వచ్చాను. పంజాబ్ కాంగ్రెస్‌కు సంబంధించిన నిర్ణయం నాకు తెలియగానే మీకు చెబుతాను''అని మీడియాతో మాట్లాడుతూ రావత్ అన్నారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా సిద్ధూను నియమించనున్నట్టు వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన సోనియాగాంధీని కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పంజాబ్ యూనిట్‌లో విభేదాలు తలెత్తడంతో అధిష్ఠానం అప్రమత్తమైంది. పరిష్కారం కోసం కసరత్తు చేస్తోంది. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌, సిద్ధూ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో గత వారం సోనియాగాంధీని అమరీందర్ సింగ్ కలుసుకున్నారు.

Updated Date - 2021-07-16T22:06:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising